పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావాలంటూ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ట్విట్టర్‌లో ఆమధ్య ట్వీట్ల వర్షం కురిపించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. వర్మ మాటల్ని పవన్ మొత్తానికి నిజం చేశారు. రాజకీయాల్లోకి రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇవాళో, రేపో పూర్తి వివరాలు తెలియనున్నాయి. "పవన్ కళ్యాణ్‌లో నిజాయితీ ఉంది, చూట్టానికి బాగుంటాడు, సినిమాల్లో అయితే ధియేటర్లలోనే చూడాలి, రాజకీయాల్లోకి వస్తే న్యూస్ ఛానల్స్‌లో రోజూ చూడొచ్చు" అంటూ తన ట్వీట్లకు కారణాన్ని వర్మ నాడు వివరించాడు. అది వర్మశైలి వ్యంగ్యమో, మనసులోనుంచి వచ్చిన మాటో చెప్పలేముగానీ పవన్ కళ్యాణ్‌లో నిజాయితీ, కొన్ని సిద్ధాంతాలు, ఆదర్శాలు, సమాజానికి ఏదో చేయాలని(concern) ఉందని మాత్రం దాదాపుగా అందరూ అంగీకరిస్తారు. అధికారమో, డబ్బో మాత్రమే లక్ష్యమే అయితే తన వృత్తిలో అత్యద్భుతమైన దశకు చేరుకున్న ప్రస్తుతతరుణంలో దానిని పణంగా పెట్టి రాజకీయాలలో దిగడని టాలీవుడ్ వర్గాలు ముక్తకంఠంతో చెబుతున్నాయి. కానీ రాజకీయాలకు కేవలం నిజాయితీ, ఆదర్శాలు, పుస్తక పరిజ్ఞానం మాత్రమే ఉంటే సరిపోదన్నది అందరికీ తెలిసిన విషయమే. అందులోనూ సొంత అన్నగారైన ...
ఆనోభద్రా క్రతవోయంతు విశ్వత: Let noble thoughts come from all sides