Skip to main content

Posts

Showing posts with the label అల్లు అర్జున్

మళయాళ నిర్మాతలను ప్రాధేయపడుతున్న అల్లు అర్జున్

కేరళలోని మళయాళ మనోరమగ్రూప్ కు చెందిన ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ 'మళవిల్ మనోరమ' ఓనమ్ సందర్భంగా, ఈనెల 15న తమ ఛానల్ లో 'మల్లు' అర్జున్‌ ఇంటర్వ్యూను ప్రసారం చేసింది. అరగంటకుపైగా సాగిన ఆ కార్యక్రమంలో అతనిని వ్యక్తిగత విషయాలగురించి తెలుగులోకూడా ఎవరూ అడగనంత వివరంగా, చిన్న చిన్న వాటినికూడా ప్రస్తావిస్తూ ఆ ఛానల్ ప్రతినిధి ఇంటర్వ్యూ చేసింది.  అతనిని మళయాళ ప్రేక్షకులు ఎంత నిశితంగా గమనిస్తున్నారనేది, అతనికి అక్కడ ఎంత ఫాలోయింగ్ ఉందనేది ఆ యాంకర్ మాటలనుబట్టి అర్థమవుతోంది .  ప్రతి సినిమాలోనూ అల్లు అర్జున్ ను మొదట హీరోయిన్ ఇష్టపడదని , చివరకు మాత్రం అతను ఆమె హృదయాన్ని , ప్రేక్షకుల సానుభూతిని గెలుచుకుంటాడంటూ ఆర్య , హ్యాపీ , జులాయి చిత్రాలను ఉదాహరణలుగా చూపిస్తూ విశ్లేషించింది . రెడ్ బుల్ త్రాగినట్లు  అంతబాగా డాన్స్ లు చేయటానికి ఎనర్జీ ఎక్కడనుంచి వస్తుందని ప్రశ్నించింది . మళయాళ యువత అతనంటే ఊగిపోతున్నారని, ఏ మూలకు వెళ్ళినాఅల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ బోర్డ్ కనబడుతోందని ఆ యాంకర్ చెప్పింది.                           క...