Skip to main content

Posts

Showing posts from September, 2014

'ఆగడు' కాదు - 'దూకుడు సింగ్'

టీజర్ విడుదలదగ్గరనుంచి గబ్బర్ సింగ్ తో పోల్చబడుతున్న 'ఆగడు' చిత్రం, నిన్న విడుదలతర్వాతచూస్తే ఆ వాదనను నిజంచేసేటట్లుగా ఉంది. చిత్ర రచయితలు, దర్శకుడు శ్రీనువైట్లపై గబ్బర్ సింగ్ ప్రభావం స్పష్టంగా...ముఖ్యంగా మూలకథలో, ఫస్ట్ హాఫ్  లో, సన్నివేశాలలో కొట్టొచ్చినట్లు కనబడుతుంది. మరోవైపు శ్రీనువైట్ల-మహేష్ కాంబినేషన్లో వచ్చిన దూకుడు ప్రభావం మరోవైపు. వెరసి ఇది దూకుడుసింగ్ అయింది. ఈ పరమ రొటీన్, ఫార్ములా కథకు కథనంలో కొత్తదనం ఏమీ లేకపోవటం పెద్ద మైనస్. ఎప్పుడూ ఎవరో ఒకరితో గొడవపెట్టుకునే దర్శకుడు శ్రీనువైట్ల ఈ సారి కోనవెంకట్, గోపిమోహన్ లతో గొడవపెట్టుకుని 'ఆగడు'కు అనిల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, ప్రవీణ్ వర్మ అనే కొత్త రచయితలను పెట్టుకున్నారు. వీరి డైలాగులు బాగానే ఉన్నప్పటికీ అవి సంక్లిష్టంగా, హైరేంజ్ లో ఉండటం ప్రధానంగా మైనస్ పాయింట్. మహేష్ విలన్స్ ను ట్రాప్ చేయటానికి తన పాత హిట్ సినిమాల కథలను చెప్పే కాన్సెప్ట్ సులభంగా అర్ధంకావటంలేదు. మీలో ఎవరు పోటుగాడు ఎపిసోడ్ లోని కాన్సెప్ట్ కూడా అలాగే ఉంది. డైలాగులు, అరుపులు, పంచ్ లు సినిమాలో బాగా ఎక్కువైపోయాయి. మహేష్ డైలాగులు కొన్నిచోట్ల అర్ధంకాన

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు తృటిలో తప్పిన చెప్పుదెబ్బ!

శతాధిక చిత్రాల దర్శకుడు, అన్నమయ్య, రామదాసువంటి 'కళాఖండాల' సృష్టికర్త కె.రాఘవేంద్రరావు గతంలో ఒకసారి ప్రముఖ నిర్మాత కె.మురారి చెప్పుదెబ్బనుంచి తృటిలో తప్పించుకున్నారట. ఈ వైనాన్ని మురారి ఇవాళ చెన్నైలో స్వయంగా వివరించారు.  చెన్నైలో నివసిస్తున్న మురారి ఇవాళ ఒక పుస్తకా‌విష్కరణ కార్యక్రమం సందర్భంగా విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ రాఘవేంద్రరావుకు గీతం యూనివర్సిటీ యాజమాన్యం డాక్టరేట్ ప్రదానం చేయనున్నట్లు ప్రకటించడంపై స్పందించారు. సంస్కారహీనుడైన రాఘవేంద్రరావుకు డాక్టరేట్ ఇవ్వటంలో ఔచిత్యమేమిటని ప్రశ్నించారు. గీతం యూనివర్సిటీ డాక్టరేట్‌లు ప్రకటింటిన ముగ్గురిలో మిగిలిన ఇద్దరి విషయంలో ఎవరూ వేలెత్తి చూపాల్సిన అవసరంలేదని, అయితే రాఘవేంద్రరావుకు ఇవ్వటం సరైన నిర్ణయం కాదని మురారి అన్నారు. గీతం విద్యాసంస్థల వ్యవస్థాపకుడు మూర్తి అంటే తనకెంతో గౌరవం ఉందని చెప్పారు.  ఇక రాఘవేంద్రరావు గురించి చెప్పుకొస్తూ, అతనికి సంస్కారం లేదని, పెద్దలంటే గౌరవంలేదని మురారి అన్నారు. ఒకసారి అతను తమ ఇంటికి వచ్చినపుడు తమ ఇంటి హాల్‌లో తన తల్లిదండ్రుల ఫోటోను చూశాడని, ఆ ఫోటోలోని తన తల్లిని ఉద్దేశించి ఏమిటి నల్లగా,

'నమస్తే తెలంగాణ-2'గా మారుతున్న 'ఈనాడు'

వ్యాపారవేత్తలు పత్రికాధిపతులైతే చాలా ప్రమాదమని పత్రికారంగ పెద్దలు ఏనాడో చెప్పారు. వ్యాపారవేత్తలు తమ వ్యాపార ప్రయోజనాలకోసం పత్రికా ప్రమాణాలను పణంగా పెడుతున్న ప్రస్తుత తరుణాన్ని ఆ పెద్దలు ఆనాడే ఊహించి ఉంటారు. హైదరాబాద్‌లో, తెలంగాణలోని మిగిలిన ప్రాంతాలలో పలు వ్యాపారాలను, ఆస్తులను కలిగిఉన్న రామోజీరావు, ఆయన పుత్రరత్నం కిరణ్ - ముఖ్యమంత్రి కేసీఆర్‌పట్ల విధేయత ప్రకటించుకోవడానికి(to be in good books of KCR) నానా తంటాలు పడుతున్నారు. కేసీఆర్‌పై విమర్శలుగానీ, ప్రభుత్వ వ్యతిరేక వార్తలుగానీ తమ పత్రికలో ప్రముఖంగా కనపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రామోజీరావు వ్యాపారాలను కేసీఆర్ ఏమి చేస్తాడనుకుంటున్నారా? తెలంగాణ ప్రభుత్వంవస్తే రామోజీ ఫిలింసిటీని నాగళ్ళతో దున్నిస్తానని గతంలో అన్న కేసీఆర్ ఇప్పుడు అంతపని చేయకపోవచ్చుగానీ, తెలంగాణలో కొత్త ఫిలిమ్ సిటీ(కేసీఆర్ ఇటీవల ఈమేరకు ప్రకటన చేసిన విషయం తెలిసిందే) పెడితేమాత్రం అంతపని చేసినట్లే అవుతుంది. కేసీఆర్ చేసే ప్రతిపనినీ విమర్శించాలనీ, ఆయన ప్రతిమాటనూ ఖండించాలని వివేకము, విచక్షణ ఉన్నవారు ఎవరూ అనరు. అయితే వార్తను వార్తగా నివేదించటం, రాగద్వేషాలకతీ