Skip to main content

Posts

Showing posts from June, 2014

చంద్రబాబును అభినందించకుండా ఉండలేం!

ఏ వ్యక్తయినా విజయం సాధించగానే ఆ సమయంలో ఆ వ్యక్తిలోని సానుకూల అంశాలు ప్రముఖంగా కనబడతాయి. అయితే 2014 ఎన్నికలలో చంద్రబాబు సాధించిన విజయం ఆషామాషీది కాదు. పదేళ్ళపాటు అత్యంత కఠినాత్మక సమస్యలను, సవాళ్ళను ఎదుర్కొనికూడా పార్టీని కాపాడుకుంటూ తిరిగి అధికారపగ్గాలు చేపట్టటం ఒక విజయగాధ అనే చెప్పాలి. ఆయన విజయంనుంచి స్ఫూర్తి పొందవలసింది ఎంత అనేది తెలుసుకోడానికి ప్రయత్నిద్దాం.  పదేళ్ళపాటు అత్యంత ప్రతికూల, కఠినాతి కఠిన పరిస్థితులను, అవమానాలను, హేళనలను ఎదుర్కొన్నారు.  ప్రత్యర్ధి పార్టీలలోని గల్లీనాయకులనుంచి ఢిల్లీ నేతలదాకా ప్రతిఒక్కరూ చంద్రబాబును తిట్టేవారే.  ఇక సొంతపార్టీనుంచి పలువురు అగ్రనాయకులు ఇతరపార్టీలకు క్యూకట్టటం.  కుటుంబంలో అసంతృప్తితో రగులుతున్న  ఒకవర్గం .  ఒకానొక సమయంలో పార్టీ అస్తిత్వమే ప్రశ్నార్ధకంగా మారింది.   ఇంతటి పరిస్థితులలో మరొకరైతే కాడిపారేసి పారిపోయేవారని చెప్పకతప్పదు. చంద్రబాబు వీటన్నంటినీ తట్టుకున్నారు. మళ్ళీ పార్టీని మళ్ళీ విజయందిశగా నడిపించి అధికారాన్ని చేపట్టారు. ఈ క్రమంలో ఆయన అనుసరించిన సహనం, ఓర్పు, సానుకూలవైఖరి, పట్టుదల, కృషి, ఆశావహదృక్పథం, తప్పులను తెలుస