Skip to main content

Posts

Showing posts from November, 2020

గ్రేటర్‌లో జనం గుణపాఠం చెప్పవలసింది కేసీఆర్‌కా, బీజేపీకా?

  రేపటి ఎన్నికల విషయంలో హైదరాబాద్ ప్రజలు ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. వరదనీటితో అతలాకుతలమై, రోజుల తరబడి సొంత ఇళ్ళలో ఉండలేక ఎక్కడెక్కడో తలదాల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే కనీసం పలకరించటానికి కూడా దొరకు తీరిక దొరకలేదు, ఓట్లు అడగటానికి మాత్రం తయారై వచ్చేశాడని జనం మండిపడుతున్నారు. చివరకు టీఆర్ఎస్‌ సానుభూతిపరులు కూడా ఈసారి కారుకు గట్టి ధమ్కీ తగలితేనే కేసీఆర్ సరిగ్గా సెట్ అవుతాడు, అహంకారం దిగిపోతుంది అనుకుంటున్నారంటే జనం అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. డిసెంబర్ 4న వెలువడే ఫలితాల్లో టీఆర్ఎస్‌కు మైండ్ బ్లాక్ అయ్యే దెబ్బ తగలబోతుందనేది సుస్పష్టం. అయితే, ప్రజల పల్స్ ఇలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంటే, సీపీఐ నారాయణ మాత్రం నిన్న ఒక కొత్త పాయింట్ తీశారు. ఒక బక్కాయనను ఎదుర్కోటానికి ఇంతమంది కాషాయ బాహుబలులా అని ప్రశ్న లేవనెత్తారు. పూర్తి వ్యాసం చదవాలనుకుంటే ఈ లింక్ లోకి వెళ్ళండి.

అభిజిత్‌ను గెలిపించి బిగ్ బాస్ నిర్వాహకులు ఆ తప్పు చేస్తారా!

బిగ్ బాస్ - 4లో ఫైనల్‌కు చేరుకునే టాప్ 3 కంటెస్టెంట్‌లలో ఖచ్చితంగా అభిజిత్ ఉంటాడనటంలో ప్రేక్షకులు ఎవరికీ ఎలాంటి సందేహమూ లేదు. అతనే విన్నర్ అవుతాడనే వర్గాలు కూడా బలంగానే ఉన్నాయి... బిగ్ బాస్ - 2లో కౌశల్ మందాకు లాగానే ఇతనిని విపరీతంగా సపోర్ట్ చేస్తున్న గ్రూపులు కొన్ని సోషల్ మీడియాలో తీవ్రంగా హల్‌చల్ చేస్తున్న నేపథ్యంలో. అయితే అతను విన్నర్ కావటానికి ఒక్క విషయం మాత్రం బలంగా అడ్డుపడుతుందనే వాదనకూడా మరోవైపు బలంగా వినిపిస్తోంది. పూర్తి వ్యాసాన్ని ఇక్కడ చదవండి .

ఎట్ లాస్ట్! తెలంగాణకు బాహుబలి దొరికాడు!

  కాంగ్రెస్ నేత జానారెడ్డి మూడేళ్ళ క్రితం ఓసారి విలేకరులతో మాట్లాడుతూ, కేసీఆర్‌తో తలపడటానికి బాహుబలి రానున్నాడంటూ సరదాగా వ్యాఖ్యానించారు. జనంలోకూడా అప్పట్లో ఓ చర్చ నడిచింది... కేసీఆర్ ను ఎదుర్కోగల నాయకుడు తెలంగాణలో ఎవరున్నారూ అని. ఆ బాహుబలి ఎవరు అనే ప్రశ్నకు - కేసీఆర్ గద్దెనెక్కిన ఆరున్నర ఏళ్ళకుగానూ, దుబ్బాక ఫలితంతో ఇప్పుడు ఒక సమాధానం దొరికింది. తెలంగాణ రాజకీయ యవనికపై బీజేపీ ఇప్పుడు ప్రధాన ప్రత్యామ్నాయంగా అవతరించింది. ఈ క్రమంలో అది మరో విపక్షమైన కాంగ్రెస్‌ను పక్కకు నెట్టటంకాదు... తొక్కుకుంటూ పైకొచ్చింది. రాష్ట్రంలో రాజకీయసమీకరణాలలో సమూలమైన మార్పులకు దుబ్బాక ఫలితం నాంది పలికిందనటం అత్యుత్సాహమేమీ కాదు. వ్యాసం పూర్తిపాఠం చదవటానికి ఇక్కడ క్లిక్ చేయండి .