కాంగ్రెస్ నేత జానారెడ్డి మూడేళ్ళ క్రితం ఓసారి విలేకరులతో మాట్లాడుతూ, కేసీఆర్‌తో తలపడటానికి బాహుబలి రానున్నాడంటూ సరదాగా వ్యాఖ్యానించారు. జనంలోకూడా అప్పట్లో ఓ చర్చ నడిచింది... కేసీఆర్ ను ఎదుర్కోగల నాయకుడు తెలంగాణలో ఎవరున్నారూ అని. ఆ బాహుబలి ఎవరు అనే ప్రశ్నకు - కేసీఆర్ గద్దెనెక్కిన ఆరున్నర ఏళ్ళకుగానూ, దుబ్బాక ఫలితంతో ఇప్పుడు ఒక సమాధానం దొరికింది. తెలంగాణ రాజకీయ యవనికపై బీజేపీ ఇప్పుడు ప్రధాన ప్రత్యామ్నాయంగా అవతరించింది. ఈ క్రమంలో అది మరో విపక్షమైన కాంగ్రెస్‌ను పక్కకు నెట్టటంకాదు... తొక్కుకుంటూ పైకొచ్చింది. రాష్ట్రంలో రాజకీయసమీకరణాలలో సమూలమైన మార్పులకు దుబ్బాక ఫలితం నాంది పలికిందనటం అత్యుత్సాహమేమీ కాదు. వ్యాసం పూర్తిపాఠం చదవటానికి ఇక్కడ క్లిక్ చేయండి .
ఆనోభద్రా క్రతవోయంతు విశ్వత: Let noble thoughts come from all sides