ఏపీలో సంఖ్యాపరంగా అతి పెద్ద వర్గం బీసీలు. వివిధ రాజకీయపార్టీలు బీసీ మంత్రాన్ని జపిస్తుంటాయిగానీ, రెడ్లు, కమ్మలు, కాపులు, ఎస్‌సీ మాలలవంటి కులాలలాగా బీసీలు గంపగుత్తగా ఒకవైపు ఓట్లు వేయటం జరగదు. ఎందుకంటే బీసీలు అంటే యాదవ, గౌడ, శెట్టిబలిజ, పద్మశాలి, మత్స్యకార వంటి అనేక వెనుకబడిన కులాల సమాహారం. రెడ్లు, కమ్మలు, కాపులు, ఎస్‌సీలలాగా బీసీలను ఒక్కటిగా కనెక్ట్ చేసే యూనిఫికేషన్ ఫ్యాక్టర్ ఏదీ ఉండదు. అయితే ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. బీసీలపై ప్రేమ వలనో, వారి ఓట్లపై ప్రేమవలనోగానీ, జగన్మోహన్ రెడ్డి వారికి ఈ ఎన్నికల్లో వారికి పెద్దపీట వేశాడు. కొన్నిచోట్ల తన కులాభిమానాన్ని కూడా పక్కనపెట్టి రెడ్లుకు కాకుండా బీసీలకు టిక్కెట్లు ఇచ్చాడు... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి - లింక్.
కమ్మవారిని దెబ్బతీయటానికే జగన్మోహన్‌రెడ్డి రాజధానిని అమరావతినుంచి తరలిస్తున్నారని పలువురు టీడీపీ నాయకులు రాష్ట్రప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే అంశంపై మంత్రి కొడాలినాని నిన్న అసెంబ్లీలో ఒక అనూహ్యమైన కోణాన్ని ఎత్తిచూపారు . దీనితో ఈ మొత్తం వ్యవహారం ఒక కొత్త మలుపు తిరిగింది. మూడురాజధానులకుమద్దతుగా మంత్రి కొడాలినాని అసెంబ్లీలో చేసిన ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది . మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , టీడీపీలోని తమ సామాజికవర్గం నాయకులు , ఆ పార్టీకి సంపూర్ణ సహకారాలు అందిస్తున్న పత్రికాధిపతులు రామోజీరావు , రాధాకృష్ణ , టీవీ5 నాయుడులపై తనదైనశైలిలో నాని చెణుకులు విసిరారు. పంచారామాలలో ఒకటైన పుణ్యక్షేత్రం, అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచిన బౌధ్ధ స్థూపం ఉ న్న పవిత్రస్థలం , శాతవాహనులకు ...

Comments
Post a Comment