Skip to main content

Posts

Showing posts with the label apple

మైక్రోసాఫ్ట్ హస్తగతమైన నోకియా:కుమిలిపోతున్న ఫిన్లాండ్ దేశస్థులు

   14 సంవత్సరాలపాటు ప్రపంచ మొబైల్ ఫోన్ మార్కెట్ లో ఏకచ్ఛత్రాధిపత్యం వహించిన నోకియాసంస్థ అమ్ముడుపోయింది . తమ మొబైల్ ఫోన్ తయారీ విభాగాన్ని సాఫ్ట్ వేర్ దిగ్గజం 5.44 బిలియన్ యూరోలకు (7.17 బిలియన్ డాలర్లకు ) మైక్రోసాఫ్ట్ కు అమ్మేసుకుంది . అయితే 148 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఫిన్లాండ్ కంపెనీ , నెట్ వర్క్ పరికరాలు , సర్వీసులు వంటి ఇతర వ్యాపారాలను యధావిధిగా కొనసాగిస్తుంది . మొబైల్ ఫోన్ ల వ్యాపారంలో నోకియా ఆధిపత్యానికి గత కొద్ది సంవత్సరాలుగా శామ్ సంగ్ , యాపిల్ ( ఐఫోన్ తయారీసంస్థ ) కారణంగా గండిపడింది . దీని నోకియా సంస్థ స్వయంకృతాపరాథమే కారణం . బూజుపట్టిన సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్ నే పట్టుకుని వేలాడుతూ పోటీగా దూసుకొస్తున్న ఆండ్రాయిడ్ , ఆపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ లను , స్మార్ట్ ఫోన్ మార్కెట్ నూ నోకియా పట్టించుకోలేదు . వీటన్నింటినీ మించి , నోకియా తలరాతను మారుస్తాడనే నమ్మకంతో మైక్రోసాఫ్ట్ నుంచి తెచ్చుకున్న ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టీఫెన్ ఎలాప్ తన మాతృసంస్థప్రతినిధిలాగానే పనిచేశాడు . ఆండ్రాయిడ్ అవసరం నోకియాకు లేదని , మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తోనే భవిష్యత్ నోకియా స్...