Skip to main content

Posts

Showing posts from November, 2017

ఎన్‌టీఆర్-ఎంజీఆర్: పాపులారిటీలో ఎవరు గ్రేట్?

ఎన్‌టీఆర్ జీవితం ఆధారంగా మూడు - నాలుగు బయోపిక్‌లు రూపొందబోతున్నాయన్న వార్తలతో ఆయన పేరు మళ్ళీ ఒక్కసారిగా కేంద్రబిందువు అయిన సంగతి తెలిసిం దే . మరోవైపు తమిళనాడులో ఎంజీఆర్ జీవితం ఆధారంగా కూడా తాజాగా ఒక చలనచిత్రం ప్రారంభమైంది . ఈ సందర్భంగా వీరిరువురి జీవితాలమధ్య పోలిక రావటం అనివార్యం . అయితే , తమిళనాడు రాజకీయాలను దగ్గరనుంచి చూసిన తెలుగువారందరికీ , ఎంజీఆర్ ... రామారావుకంటే ఎన్నోరెట్లు పాపులర్ నేత అన్న సంగతి తెలిసిందే . రామారావు జీవితంలో బ్రహ్మాండమైన విజయాలవంటి ఉత్థానాలతోబాటు , ఘోర పరాజయాలు , వెన్నుపోట్లు వంటి పతనాలు కూడా ఉన్నాయి . ఇక ఆయన చరమాంకం అయితే ఒక నల్లటి మచ్చగా మిగిలిపోయిన సంగతి తెలిసిందే . సొంతవాళ్ళే వెన్నుపోటు పొడిచి గద్దెనుంచి తనను దించేశారన్న మానసికక్షోభతోనే ఎన్టీఆర్ ప్రాణాలు విడిచారు . ఎంజీఆర్ పరిస్థితి అలాకాదు… To Read Full Article, Click Here

'జియో' నిలువునా ముంచేసిందంటున్నారు!

గత 25-30 సంవత్సరాలలో అభివృద్ధి చెందిన టెక్నాలజీ - అంతకు ముందు 100 సంవత్సరాల కాలం మొత్తంలో జరిగిన అభివృద్ధి చెందినదానికంటే ఎన్నో రెట్లు ఎక్కువన్న సంగతి తెలిసిందే . ఇలా శరవేగంతో మారిపోతున్న టెక్నాలజీతో ఎన్నోరకాల కొత్తఉద్యోగాలు , వ్యాపారాలు , ఉపాధిమార్గాలు పుట్టుకురావటం , కొంతకాలం రాజ్యమేలిన తర్వాత అంతే వేగంగా మాయమైపోవటం కూడా జరుగుతోంది . 1980, 1990 దశకాలలో వీడియో పార్లర్ , ఎస్టీడీ బూత్ వ్యాపారాలు ఎంత జోరుగా సాగేవో అందరికీ గుర్తుండే ఉంటుంది . క్రమక్రమంగా అవి అదృశ్యమైపోయ్యాయి . అదే కోవలో , ఆ అదృశ్యమైపోతున్న జాబితాలోకి తాజాగా ఇంటర్నెట్ కేఫ్ లు వచ్చి చేరాయి . To Read Full Story, Click Here!