Skip to main content

Posts

Showing posts with the label వ్యాఖ్యలు

'నమస్తే తెలంగాణ-2'గా మారుతున్న 'ఈనాడు'

వ్యాపారవేత్తలు పత్రికాధిపతులైతే చాలా ప్రమాదమని పత్రికారంగ పెద్దలు ఏనాడో చెప్పారు. వ్యాపారవేత్తలు తమ వ్యాపార ప్రయోజనాలకోసం పత్రికా ప్రమాణాలను పణంగా పెడుతున్న ప్రస్తుత తరుణాన్ని ఆ పెద్దలు ఆనాడే ఊహించి ఉంటారు. హైదరాబాద్‌లో, తెలంగాణలోని మిగిలిన ప్రాంతాలలో పలు వ్యాపారాలను, ఆస్తులను కలిగిఉన్న రామోజీరావు, ఆయన పుత్రరత్నం కిరణ్ - ముఖ్యమంత్రి కేసీఆర్‌పట్ల విధేయత ప్రకటించుకోవడానికి(to be in good books of KCR) నానా తంటాలు పడుతున్నారు. కేసీఆర్‌పై విమర్శలుగానీ, ప్రభుత్వ వ్యతిరేక వార్తలుగానీ తమ పత్రికలో ప్రముఖంగా కనపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రామోజీరావు వ్యాపారాలను కేసీఆర్ ఏమి చేస్తాడనుకుంటున్నారా? తెలంగాణ ప్రభుత్వంవస్తే రామోజీ ఫిలింసిటీని నాగళ్ళతో దున్నిస్తానని గతంలో అన్న కేసీఆర్ ఇప్పుడు అంతపని చేయకపోవచ్చుగానీ, తెలంగాణలో కొత్త ఫిలిమ్ సిటీ(కేసీఆర్ ఇటీవల ఈమేరకు ప్రకటన చేసిన విషయం తెలిసిందే) పెడితేమాత్రం అంతపని చేసినట్లే అవుతుంది. కేసీఆర్ చేసే ప్రతిపనినీ విమర్శించాలనీ, ఆయన ప్రతిమాటనూ ఖండించాలని వివేకము, విచక్షణ ఉన్నవారు ఎవరూ అనరు. అయితే వార్తను వార్తగా నివేదించటం, రాగద్వేషాలకతీ...