Skip to main content

Posts

Showing posts from 2016

'వంగవీటి' కాదు 'దేవినేని' అంటున్నారు!

ఎల్లప్పుడూ ప్రజల నోళ్ళలో నానుతూ సంచలనంగా ఉండాలని కోరుకునే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం వంగవీటి నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. కోస్తా ఆంధ్ర రాజకీయాలలో, అదీ బెజవాడలో ఎవరూ మరిచిపోలేని నాయకుడు వంగవీటి మోహనరంగా కథ ఆధారంగా తీస్తున్న చిత్రం కావటంతో ఇది మొదటినుంచీ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కోస్తాలోని రెండు ప్రధాన కులాలకు సంబంధించిన సబ్జెక్ట్ అయినందున అంత సున్నితమైన అంశాన్ని వర్మ ఎలా డీల్ చేస్తాడా అని అందరిలో ఆసక్తి నెలకొంది. చిత్రం స్క్రిప్టు తయారీలో భాగంగా వర్మ రెండుసార్లు విజయవాడవెళ్ళి ఇరు వర్గాలనూ కలుసుకున్నారు. ఆయనకు దేవినేని సహకరించినప్పటికీ వంగవీటి కుటుంబం మాత్రం సానుకూలంగా స్పందించలేదు. దానికి కారణం వర్మ నిర్మాణంలో గతంలో రూపొందిన 'బెజవాడ' చిత్రంలో దేవినేని వర్గాన్నే హీరోగా చూపించటమేనని టాక్ వినబడింది. పూర్తి కథనం చదవటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

గౌతమీపుత్ర: క్రిష్ కాపీ నైపుణ్యానికి పరాకాష్ఠ!

నందమూరి బాలకృష్ణ 100వ చిత్రంగా ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటున్న గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలయిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ ఇవాళ్టికి యూట్యూబ్ లో 40 లక్షల వ్యూస్ సంపాదించి టాలీవుడ్ లో రికార్డులన్నింటినీ తిరగరాసింది. ఈ సరికొత్త రికార్డు ఆవిష్కరణ సందర్భంగా నందమూరి అభిమానులు సంబరాలు కూడా జరుపుకుంటున్నారు.  అయితే రెండు నిమిషాల 20 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్ ఇప్పుడు సినిమాపండితుల మధ్య చర్చనీయాంశమయింది. ఈ కథనం పూర్తిగా చదవటానికి, ఇక్కడ క్లిక్ చేయండి.

రెడ్‌మి, లెనోవా ఫోన్‌లు అంతచౌకగా ఎలా అమ్ముతున్నారో తెలుసా!

రెడ్‌మి(షియామి), లెనోవా, జియానీ, లీకో, హ్వావేయ్(హువావే అని కూడా పిలుస్తారు), కూల్‌ప్యాడ్ వంటి చైనా కంపెనీల మొబైల్ ఫోన్‌ల మోడల్స్ భారత్‌లో అత్యధిక సంఖ్యలో అమ్ముడుపోతున్న సంగతి తెలిసిందే. మంచి కాన్ఫిగరేషన్, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఉన్న పవర్‌ఫుల్ ఫోన్లను శాంసంగ్, సోనీ, ఎల్‌జీ, హెచ్‌టీసీ వంటి బడా కంపెనీల ఫోన్ల ధరలలో మూడోవంతుకే అందిస్తుండటంతోనే పైన పేర్కొన్న చైనా కంపెనీల ఫోన్‌లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ముఖ్యంగా రెడ్‌మి సంస్థ ఫోన్‌లు భారతీయుల హృదయాలను కొల్లగొట్టి వారి జేబుల్లో తిష్ఠవేసుకుని కూర్చున్నాయి. రెడ్‌మి నోట్ 3, రెడ్‌మి 3ఎస్, రెడ్‌మి 3 ప్రైమ్ మోడల్స్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మొబైల్ ఫోన్లుగా ఇటీవల రికార్డులకెక్కాయి. ఈ మోడల్స్‌లోని స్పెసిఫికేషన్స్‌తోనే శాంసంగ్, సోనీ, ఎల్‌జీ కంపెనీల ఫోన్లను కొనాలంటే మూడింతలు ఎక్కువ డబ్బు పెట్టాల్సిఉంటుంది(రెడ్‌మి రెండేళ్ళ క్రితం తయారుచేసిన మోడల్స్‌లో స్నాప్ డ్రాగన్ 400, స్నాప్ డ్రాగన్ 410 ప్రాసెసర్‌ను వాడగా, అదే ప్రాసెసర్‌లతో తయారుచేసిన మోడల్స్‌ను శాంసంగ్ ప్రస్తుతం 15-20 వేల రేంజిలో అమ్ముతోంది). మరి ఈ చైనా కంపెనీలు ఇంత కారుచౌకగా ఎల

'మైండ్ గేమ్' ట్రాప్ లో అడ్డంగా ఇరుక్కున్న జగన్

జగన్ ఎంత కట్టడి చేసినా ఉపయోగం లేకుండా పోతోంది. ఎమ్మెల్యేలు కట్లు తెంచుకుని పారిపోయి టీడీపీ శిబిరంలో చేరిపోతున్నారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ చేరారు. మరికొంతమంది మంచి తరుణంకోసం పొంచిచూస్తున్నారని అంటున్నారు. ఇవాళ జగన్ నిర్వహించిన ఎమ్మెల్యేల సమావేశానికి ఏడుగురు గైర్హజరయ్యారని సమాచారం. To Read Full Story, Click Here.

ఈడీ సమన్లే జగన్ కొంప ముంచాయా!

మొత్తానికి దోబోచులాట ముగిసింది. అస్పష్టత తొలగిపోయింది. ఫిరాయింపులు జరిగిపోయాయి. అయితే ఈ ఐదుగురు ప్రజాప్రతినిధులూ వైసీపీనుంచి టీడీపీలోకి ఎందుకు ఫిరాయించారనేదానిపై మాత్రం స్పష్టత రాలేదు. మీడియాలో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. స్థూలంగా చూస్తే, ప్రతిపక్షం నుంచి అధికారపార్టీలోకి ప్రజాప్రతినిధులు ఫిరాయించటం సర్వసాధారణంగా జరిగే రివాజే.To Read Full Story, Click Here.

చంద్రబాబు గారూ! ఏమిటీ పిచ్చి మాటలు ?

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొన్న శనివారం అంతా కాస్త తేడాగా మాట్లాడారు. మూడు సందర్భాలలో ఆయన మాట్లాడిన మాటలు విచిత్రంగా, వివాదాలకు తావిచ్చేవిధంగా ఉన్నాయి. సాక్షిపత్రిక తనపై, తన కుటుంబంపై వెలువరిస్తున్న కథనాలపై స్పందిస్తూ, తన వంటిపై కనీసం ఉంగరం, వాచీ కూడా ఉండవని, జేబులో ఒక్క రూపాయి కూడా ఉండదని, తనలాంటివాడిని పట్టుకుని ఇష్టమొచ్చినట్లు కథనాలు రాస్తున్నారని వాపోయారు. బాబుగారి ఆవేదన పెద్ద చర్చనీయాంశమయింది.To Read Full Story, Click Here.  

కేసీఆర్ హవా ఎంతకాలం సాగుతుంది?

పశ్చిమ దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలలో దేశాధినేతల పాపులారిటీపై నిర్దిష్ట కాలవ్యవధులతో తరచూ సర్వేలు నిర్వహిస్తుంటారు. మనదగ్గర ఆ సర్వేలు అరుదుగా జరుగుతుంటాయిగానీ, జరిగితే కేసీఆర్ పాపులారిటీ ఇప్పుడు తారాస్థాయికి చేరినట్లు ఫలితాలు వచ్చిఉండేవనటంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. తెలంగాణలో పరిస్థితి ఇప్పడు అలాగే ఉంది. To Read Full Story, Click Here.

కాపు ఓట్ బ్యాంకును కాలదన్నుకుంటున్న చంద్రబాబు

గత మూడు రోజుల పరిణామాలు చూస్తుంటే చంద్రబాబు నాయుడు మరో తప్పటడుగు వేస్తున్నట్లే కనబడుతోంది. 1999లోగానీ, 2014లోగానీ తనకు అండగా నిలబడింది కాపులేనంటూ చెప్పుకోస్తూనే తన అనాలోచిత నిర్ణయాలతో గణనీయసంఖ్యలో ఉన్న ఓట్లు ఉన్న ఆ సామాజికవర్గాన్ని చేజార్చుకునేటట్లు కనిపిస్తున్నాయి. To Read Full Story, Click Here.

కేటీఆర్ రాజీనామా సవాల్:ఆత్మవిశ్వాసమా - అతి విశ్వాసమా?

గ్రేటర్ హైదరాబాద్ పీఠంపై గులాబీ జెండా ఎగరకపోతే నైతిక బాధ్యతగా తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ నిన్న చేసిన సంచలన ప్రకటన తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది.To Read Full Story, Click Here.

బాలయ్యను ఎదిరించి జూనియర్ ఎన్‌టీఆర్ నిలవగలడా!

నందమూరి అభిమానులు నిట్టనిలువుగా చీలిపోయారనే టాక్ బలంగా వినిపిస్తోంది. పెద్ద ఎన్‌టీఆర్‌కు వారసుడు ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. బాలయ్యకు జూనియర్ ఎన్‌టీఆర్‌కు మధ్య గొడవలు తారాస్థాయికి చేరినట్లే కనబడుతోంది. ఇప్పటివరకు అది కోల్డ్ వార్‌గానే ఉంది. అయితే విభేదాలు ముదురుతున్నాయి. ఆ అగ్ని జ్వాలల్లో సోషల్ మీడియా మరింత ఆజ్యం పోస్తోంది. దానికి తోడు ఇద్దరి సినిమాలూ సంక్రాంతికి పోటీ పడుతుండటంతో గతంలోని ప్రచ్ఛన్నయుద్ధం ఇప్పుడు పబ్లిక్ వార్‌గా మారేటట్లు కనిపిస్తోంది.To Read Full Story, Click Here