బిగ్
బాస్ రెండో సీజన్ మొదలైనప్పుడు
కొద్ది రోజులపాటు నానిని
జూనియర్ ఎన్టీఆర్ తో పోల్చి
పెదవి విరిచారు చాలామంది.
నానికూడా
తొలినాళ్ళలో కొద్దిగా బెరుకుగానే
కనిపించాడు. తన
సహజమైన ఆత్మవిశ్వాసం కనిపించలేదు.
కానీ
మెల్లగా పుంజుకున్నాడు.
వారం
ముగియగానే వీకెండ్ లో వచ్చి,
ఆ
వారమంతా హౌస్ లో జరిగిన సంఘటనలను
విశ్లేషించటంలో,
సభ్యులు
వ్యక్తిగత పనితీరు,
ప్రవర్తనను
అంచనా వేయటంలో మంచి పరిణతి
ప్రదర్శించి అందరినీ
ఆకట్టుకున్నాడు. ఇక
అక్కడనుంచి అతను ఎక్కడా
తడబడలేదు. బ్రహ్మాండంగా
షోను నడిపించారు.
తప్పులు
చేసిన ఇంటి సభ్యులను గట్టిగా
మందలించారు. సలహాలు,
సూచనలు
చక్కగా ఇచ్చాడు.Click Here to Read the Full Story...
రేపటి ఎన్నికల విషయంలో హైదరాబాద్ ప్రజలు ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. వరదనీటితో అతలాకుతలమై, రోజుల తరబడి సొంత ఇళ్ళలో ఉండలేక ఎక్కడెక్కడో తలదాల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే కనీసం పలకరించటానికి కూడా దొరకు తీరిక దొరకలేదు, ఓట్లు అడగటానికి మాత్రం తయారై వచ్చేశాడని జనం మండిపడుతున్నారు. చివరకు టీఆర్ఎస్ సానుభూతిపరులు కూడా ఈసారి కారుకు గట్టి ధమ్కీ తగలితేనే కేసీఆర్ సరిగ్గా సెట్ అవుతాడు, అహంకారం దిగిపోతుంది అనుకుంటున్నారంటే జనం అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. డిసెంబర్ 4న వెలువడే ఫలితాల్లో టీఆర్ఎస్‌కు మైండ్ బ్లాక్ అయ్యే దెబ్బ తగలబోతుందనేది సుస్పష్టం. అయితే, ప్రజల పల్స్ ఇలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంటే, సీపీఐ నారాయణ మాత్రం నిన్న ఒక కొత్త పాయింట్ తీశారు. ఒక బక్కాయనను ఎదుర్కోటానికి ఇంతమంది కాషాయ బాహుబలులా అని ప్రశ్న లేవనెత్తారు. పూర్తి వ్యాసం చదవాలనుకుంటే ఈ లింక్ లోకి వెళ్ళండి.
Comments
Post a Comment