Skip to main content

మంచు ఫ్యామిలీ సినిమాల ప్రమోషన్‌లకు పెద్దదిక్కు చిరంజీవే! ఇండస్ట్రీకి మాత్రం కాదా?


తెలుగు సినీ పరిశ్రమకు పెద్దదిక్కు లేకుండా పోయిందంటూ మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు నర్మగర్భంగా ఉన్నాయని పలు చోట్ల రాస్తున్నారు. కానీ, అతను సూటిగానే ఒక విషయాన్ని ఢంకా బజాయించి చెబుతున్నారు. ప్రస్తుతం తెలుగు పరిశ్రమకు ఉన్నంతలో చిరంజీవే పెద్ద దిక్కు అని తమ్మారెడ్డి భరద్వాజ, మురళీ మోహన్ వంటి కొందరు ప్రముఖులు అక్కడక్కడా వినిపిస్తున్న వాదనను తాము(మంచు ఫ్యామిలీ) అంగీకరించబోమన్నది అతని వ్యాఖ్యల అంతరార్థం. 

వివాదాలకు మారుపేరు, చిరంజీవి ఆధిపత్యాన్ని అడుగడుగునా సవాల్ చేసే మోహన్ బాబు ఇలా తన కుమారుడితో వ్యాఖ్యలు చేయించటం సహజ పరిణామమే కాబట్టి అంతవరకు బాగానే ఉంది. కానీ, ఇక్కడ చిన్న తిరకాసు ఉంది. ఇటీవలికాలంలో మంచు వారు తమ సినిమాలు అన్నింటికీ చిరంజీవితోనే ప్రమోషన్ చేయిస్తున్నారు, మరోవైపు పెద్దదిక్కుమాత్రం అతనుకాదు అంటున్నారు, ఈ మతలబు ఏమిటీ అని అటు ఇండస్ట్రీలోనివారు, ఇటు ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. దీనిలో నిజంలేకపోలేదు. పూర్తి వ్యాసం చదవటానికి ఈ లింక్ లోకి వెళ్ళండి

Comments

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని...

ఏపీ ఎన్నికలు: బలంగా ప్రభావం చూపనున్న నెగెటివ్ ఓటు!

  ఐదేళ్ళు ఒక పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత ఉండటం సహజం(ఇటీవలికాలంలో ఒడిషా, అప్పట్లో ప.బెంగాల్ వంటి కొన్ని అరుదైన సందర్భాలు తప్ప). అయితే వైసీపీ పాలనలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఏపీలో ధారాళంగా అందుతున్న సంక్షేమ పథకాల పుణ్యమా అని వైసీపీకి సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, మరోవైపు వ్యతిరేకులు కూడా పెద్ద సంఖ్యలోనే తయారయ్యారు. పోలింగ్ రోజున - జగన్ సానుభూతి పరుల సంకల్పం గట్టిగా ఉంటుందా, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ గెలవకూడదు అనే వర్గాల సంకల్పం గట్టిగా ఉంటుందా అనేదానిని బట్టి ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుంది... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి -   లింక్ .  

30వ రాష్ట్రంగా రాయలసీమ! రాజుకుంటున్న 'ప్రత్యేక' ఉద్యమం

అసమానతలనుంచి అసంతృప్తి పుట్టుకొస్తుంది. అసంతృప్తినుంచి ఆక్రోశం పెల్లుబుకుతుంది. రాయలసీమ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అసంతృప్తితో సీమవాసులు రగిలిపోతున్నారు. ఏళ్ళ తరబడి వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. Read Full Story Here.