ఇంగ్లీష్ భాషలో 'పిరిక్ విక్టరీ' అనే పదప్రయోగం ఒకటి ఉంది. ఒక యుద్ధంలో ఒక వ్యక్తి గెలిచినాకూడా అంతిమంగా దానినుంచి అతను లబ్ది పొందింది తక్కువైతే దానిని పిరిక్ విక్టరీ అంటారు(He won the battle but lost the war). నిన్న రాత్రి బిగ్ బాస్ 4 ఫినాలేలో గెలిచి ట్రోఫీ పట్టుకెళ్ళింది అభిజిత్ అయినాకూడా హృదయాలను గెలుచుకుందిమాత్రం సొహైల్ కావటం చూస్తుంటే ఈ పిరిక్ విక్టరీ అన్న పదప్రయోగం గుర్తురాక మానదు.
సామాన్య మధ్యతరగతి కుటుంబంలోనుంచి వచ్చిన సొహైల్‌కు ఇంట్లో ఎన్నో బాధ్యతలు, సమస్యలు ఉన్నాయని స్పష్టంగా తెలుసు. తన తండ్రి ఒక హార్ట్ పేషెంట్ అని ఒక కిడ్నీ లేదని, ఇంట్లో పెళ్ళి కావాల్సిన సిస్టర్స్ ఉన్నారు, తను, తన తమ్ముడు ఇంకా సెటిల్ కాలేదని నిన్న అతనే చెప్పాడు. అయినాకూడా తాను గెలుచుకున్న రు.25 లక్షలనుంచి స్టేజిమీద అప్పటికప్పుడే రు.10 లక్షలను ఛారిటీకి ఇస్తానని ప్రకటించి తన magnanimity ను చాటుకున్న సొహేల్ - స్టేజిమీద ఉన్న చిరంజీవి, నాగార్జునలనేకాదు, యావత్ తెలుగు ప్రజల హృదయాలను గంపగుత్తగా గెలిచేశాడు. నాగార్జున అయితే సొహేల్ స్టేజిమీదకు రాగానే ఎత్తుకుని మొత్తం హౌస్‌లో తన అభిమాన కంటెస్టెంట్ ఎవరో అన్యాపదేశంగా చెప్పేశారు. సొహేల్ ఇవ్వాలనుకున్న ఛారిటీ మొత్తాన్ని తాను ఇస్తానని, ప్రైజ్ మనీ రు.25 లక్షలూ ఇంటికి తీసుకెళ్ళాలని స్టేజిపైనే ప్రకటించేశారు... పూర్తి వ్యాసం చదవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
Post a Comment