ఆంధ్రప్రదేశ్ లో తటస్థంగా ఉండే విద్యావంతులు, ఆలోచనపరులు ఒక విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వారికి ముందుచూస్తే నుయ్యి, వెనకచూస్తే గొయ్యి(పెనంనుంచి పొయ్యిలోకి అని, ఇంగ్లీషులో between the devil and the deep sea అనికూడా అంటారు) అన్నట్లుగా ఉంది . ఒకవైపేమో, ఏపీలో అవినీతిని కనీ వినీ ఎరగని రీతిలో తారాస్థాయికి చేరేటట్లు చేసి, అస్మదీయవర్గం దోచుకోటానికి తలుపులు బార్లా తెరిచిన చంద్రబాబు ప్రభుత్వం ఉంది. మరోవైపేమో... ఏమి చేసైనా ముఖ్యమంత్రి గద్దెనెక్కాలనే ఏకైక లక్ష్యంతో సాగుతూ, ఏపీ అభివృద్ధి అవ్వకూడదని బలంగా కాంక్షించే కేసీఆర్ తో జట్టుకట్టిన ప్రతిపక్ష నాయకుడు జగన్ ఉన్నారు. పూర్తివ్యాసం చదవటానికి ఇక్కడ క్లిక్ చేయండి. Click Here.
రేపటి ఎన్నికల విషయంలో హైదరాబాద్ ప్రజలు ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. వరదనీటితో అతలాకుతలమై, రోజుల తరబడి సొంత ఇళ్ళలో ఉండలేక ఎక్కడెక్కడో తలదాల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే కనీసం పలకరించటానికి కూడా దొరకు తీరిక దొరకలేదు, ఓట్లు అడగటానికి మాత్రం తయారై వచ్చేశాడని జనం మండిపడుతున్నారు. చివరకు టీఆర్ఎస్ సానుభూతిపరులు కూడా ఈసారి కారుకు గట్టి ధమ్కీ తగలితేనే కేసీఆర్ సరిగ్గా సెట్ అవుతాడు, అహంకారం దిగిపోతుంది అనుకుంటున్నారంటే జనం అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. డిసెంబర్ 4న వెలువడే ఫలితాల్లో టీఆర్ఎస్కు మైండ్ బ్లాక్ అయ్యే దెబ్బ తగలబోతుందనేది సుస్పష్టం. అయితే, ప్రజల పల్స్ ఇలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంటే, సీపీఐ నారాయణ మాత్రం నిన్న ఒక కొత్త పాయింట్ తీశారు. ఒక బక్కాయనను ఎదుర్కోటానికి ఇంతమంది కాషాయ బాహుబలులా అని ప్రశ్న లేవనెత్తారు. పూర్తి వ్యాసం చదవాలనుకుంటే ఈ లింక్ లోకి వెళ్ళండి.

Good Analysis. కానీ ఒకవేళ తెలుగుదేశం గెలిస్తే మాత్రం ముఖ్యమంత్రి గా లోకేషబాబుని కుర్చోబెడతారు (దానికన్నా ముందు ఆయన్ని కొన్నాళ్ళు ఉపముఖ్యమంత్రిగా కుర్చోపెట్టవచ్చు). ఆ దెబ్బతో జగన్ కన్నా ఈయనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది.
ReplyDeleteమందలగిరి మేలా జగన్ మేలా.
ReplyDelete