Skip to main content

బీహార్ ఫలితాలు: మళ్ళీ నితీష్‌కే కుర్చీ, లాలూకి గడ్డి, రాహుల్‌కు చెయ్యి

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కే ప్రజలు మళ్ళీ పట్టం కట్టినట్లు దాదాపుగా స్పష్టమవుతోంది. జేడీయూ-బీజేపీ కూటమి స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకుపోతోంది. మరోవైపు బీహార్‌ను పదిహేనేళ్ళపాటు అప్రతిహతంగా పాలించిన లాలూకు(పశుగ్రాసం కుంభకోణాన్ని అక్కడి జనం మరిచిపోలేదనుకుంటా...!) మరోసారి ఘోర పరాభవం ఎదురయింది. లాలూ-పాశ్వాన్ కూటమిని బీహార్ ప్రజలు తిరస్కరించారు. అటు రాహుల్ కరిష్మా కూడా బీహార్లో పనిచేయలేదు. ఆయనకు ప్రజలు చెయ్యిచ్చారు.  కాంగ్రెస్‌ రెండంకెలకు చేరుకోవడం కూడా కష్టమయ్యేటట్లుగా ఉంది.

నితీష్ చేసిన అభివృద్ధే ఆయనకు విజయం సాధించిపెట్టింది. ముఖ్యంగా రహదారుల నిర్మాణం, సుదీర్ఘంగా పెండింగులో ఉన్న వంతెనల నిర్మాణాలను చేపట్టడం, నేరాలసంఖ్యను తగ్గించడం, లక్షమంది టీచర్లను నియమించడం, వైద్యులు తప్పనిసరిగా ప్రాధమిక విద్యాకేంద్రాలలో పనిచేయాలని నిబంధన పెట్టడం వంటి చర్యల వలన నితీష్‌కు ప్రజాదరణ లభించింది. దానికితోడు ఆయన వ్యూహాత్మకంగా...ఈ ఎన్నికల ప్రచారంలో గుజరాత్ అల్లర్లకేసు నిందితుడయిన ముఖ్యమంత్రి నరేంద్రమోడిని(సంకీర్ణ భాగస్వామ్యపక్షానికి చెందిన ముఖ్యనేత అయినప్పటికీ) దూరంగా పెట్టారు.  సరిగ్గా  ఐదేళ్ళక్రితం ఇదేరోజున నితీష్ బీహార్ 31వముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Comments

  1. బీహార్ ప్రజలకున్న విజ్ఞతకూడా మన తెలుగోళ్ళకు లేకుండా పోయింది అప్పుడు.ఇప్పుడు బీహార్ స్థానానికన్న దిగువకు మన రాష్ట్రం దిగజారిపోయింది.కాంగ్రెస్ వారు ప్రజలకు కుక్కలకేసినట్లు ఓ ఎముకేసి వాళ్ళేమో మొత్తం దోచేసినారు.

    ReplyDelete
  2. తేజస్వి గారు, మీ గత టపాలకు వచ్చిన కామెంట్స్ చూసాను,
    బ్లాగ్ అడ్మిన్ గా మీరు వచ్చిన కామెంట్స్ ను పరిశీలించాల్సి ఉంటుంది కదా?
    క్రితం టపాకు వచ్చిన కామెంట్స్ లో కొందరి వ్యక్తుల వ్యక్తిగత దూషణ ఉంది.
    న్యూస్ పేపర్ లో తప్పులు ఎంచి చక్కగా చూపిస్తున్న మీరు, మీ బ్లాగ్ లో ఉన్న
    ఇలాంటి అసంబద్ధ కామెంట్స్ ను డిలీట్ చెయ్యకపోతే వచ్చే రీడర్స్ అసౌకర్యంగా
    ఫీల్ అవుతారనడంలో సందేహం లేదు.

    ReplyDelete
  3. వైదేహిగారూ, మీ సూచనకు కృతజ్ఞ‌తలు. ఈ విషయం మీద నాకు అవగాహన లేదు, నేను ఆలోచించనుకూడా లేదు. ఏమిటి ఇలా ఇక్కడకొచ్చి తిట్టుకుంటున్నారు అని మాత్రం అనుకున్నాను. మీ సూచనమేరకు ఆ కామెంట్స్ తొలగించాను. ఇంకా ఏమైనా సలహాలు, సూచనలు చేస్తే సంతోషిస్తాను. మీ బ్లాగు కూడా చూశాను. మీరు చాలా డేరింగ్ అండ్ డాషింగ్ లాగా అనిపించారు. సంప్రదాయ దుస్తులను ఇష్టపడుతూనే(emblemలో లంగా ఓణీ ధరించిన అమ్మాయి) సంప్రదాయాలను సడలించండి అనడం quite interesting. btw మాదీ గుంటూరుజిల్లాయేనండి.(మీది తెనాలి...మాది తెనాలి)

    శుభాభినందనలతో

    ReplyDelete
  4. "రాహుల్ కరిష్మా కూడా బీహార్లో పనిచేయలేదు".

    ముందు "కరిష్మా" వుండాలి కదా, అది పనిచెయాలి అన్నా, పనిచెయక పొవడానికైనా!.

    అతనికి "కరిష్మా" వుంది అని మీరు ఎందుకు అనుకుంటున్నారు?

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఏపీ ఎన్నికలు: బలంగా ప్రభావం చూపనున్న నెగెటివ్ ఓటు!

  ఐదేళ్ళు ఒక పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత ఉండటం సహజం(ఇటీవలికాలంలో ఒడిషా, అప్పట్లో ప.బెంగాల్ వంటి కొన్ని అరుదైన సందర్భాలు తప్ప). అయితే వైసీపీ పాలనలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఏపీలో ధారాళంగా అందుతున్న సంక్షేమ పథకాల పుణ్యమా అని వైసీపీకి సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, మరోవైపు వ్యతిరేకులు కూడా పెద్ద సంఖ్యలోనే తయారయ్యారు. పోలింగ్ రోజున - జగన్ సానుభూతి పరుల సంకల్పం గట్టిగా ఉంటుందా, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ గెలవకూడదు అనే వర్గాల సంకల్పం గట్టిగా ఉంటుందా అనేదానిని బట్టి ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుంది... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి -   లింక్ .  

ఏపీలో ఏ వర్గం ఓట్లు ఎటువైపు? తటస్థ ఓటర్ల మద్దతు జగన్‌కా, కూటమికా?

  ఏపీలో సంఖ్యాపరంగా అతి పెద్ద వర్గం బీసీలు. వివిధ రాజకీయపార్టీలు బీసీ మంత్రాన్ని జపిస్తుంటాయిగానీ, రెడ్లు, కమ్మలు, కాపులు, ఎస్‌సీ మాలలవంటి కులాలలాగా బీసీలు గంపగుత్తగా ఒకవైపు ఓట్లు వేయటం జరగదు. ఎందుకంటే బీసీలు అంటే యాదవ, గౌడ, శెట్టిబలిజ, పద్మశాలి, మత్స్యకార వంటి అనేక వెనుకబడిన కులాల సమాహారం. రెడ్లు, కమ్మలు, కాపులు, ఎస్‌సీలలాగా బీసీలను ఒక్కటిగా కనెక్ట్ చేసే యూనిఫికేషన్ ఫ్యాక్టర్ ఏదీ ఉండదు. అయితే ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. బీసీలపై ప్రేమ వలనో, వారి ఓట్లపై ప్రేమవలనోగానీ, జగన్మోహన్ రెడ్డి వారికి ఈ ఎన్నికల్లో వారికి పెద్దపీట వేశాడు. కొన్నిచోట్ల తన కులాభిమానాన్ని కూడా పక్కనపెట్టి రెడ్లుకు కాకుండా బీసీలకు టిక్కెట్లు ఇచ్చాడు... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి -   లింక్ .

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని