Skip to main content

24గంటల వ్యవధిలో మూడు చోట్ల విమాన ప్రమాదాలు...89మంది మృతి

నిన్న ఉదయంనుంచి ఇవాళ ఉదయం వరకూ ప్రపంచవ్యాప్తంగా మూడు వేర్వేరుచోట్ల విమానప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మూడింటిలోనూ పెద్దదైన క్యూబా ప్రమాదంలో 68మంది చనిపోయారు. ఈ ఉదయం క్యూబా ఉత్తర ప్రాంతంలోని శాంటియాగో డి క్యూబా రాష్ట్రంనుంచి దేశరాజధాని హవానాకు వెళుతున్న ఏరోకరిబియన్ విమానయాన సంస్థ విమానం మార్గమధ్యంలో కూలిపోయింది. దీనిలో 40మంది క్యూబన్లు ఉండగా 28మంది విదేశీయులు ఉన్నారు. ప్రమాద కారణం ఇంకా తెలియలేదు.

ఇక పాకిస్తాన్ వాణిజ్య రాజధాని కరాచీలో జరిగిన రెండో ప్రమాదంలో 21మంది చనిపోయారు. ఒక ఆయిల్ కంపెనీ అద్దెకు తీసుకున్న విమానంలో తమ ఉద్యోగులను కొందరిని సింధ్ రాష్ట్రంలోని చమురు క్షేత్రాలకు తీసుకెళ్ళడానికి కరాచీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. టేకాఫ్ అవగానే విమానంలోని ఒక ఇంజన్ లో మంటలు రేగాయని పైలట్ కంట్రోల్ టవర్ కు తెలిపాడని, వెంటనే గ్రౌండ్ చేయడానికి ప్రయత్నిస్తుండగానే పేలిపోయిందని అధికారులు తెలిపారు. లోపలి మనుషుల దేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. ప్రమాద కారణం తెలియలేదు. పాకిస్తాన్ లో గత 4నెలల్లో ఇది రెండో విమాన ప్రమాదం. జులై 28న ఇస్లామాబాద్ శివార్లలో జరిగిన ప్రమాదంలో 152మంది చనిపోయారు.

ఇక ప్రస్తుత ప్రమాదాల్లోని మూడవది నిన్న ఉదయం సింగపూర్ లో జరిగింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు...గాయపడలేదు. విమానసిబ్బందిసహా మొత్తం 459మందితో సింగపూర్ నుంచి సిడ్నీ బయలుదేరిన క్వాంటాస్ ఎయిర్ లైన్స్ విమానం టేకాఫ్ అయిన కొద్దినిమిషాలకే...దానికున్న నాలుగు రోల్స్ రాయిస్ ఇంజన్లలోని ఒకదానిలో పొగలు రావడాన్ని పైలట్లు వెంటనే గమనించారు. ముందు పైలట్లు విమానంలోని ఇంధనాన్ని బయటకు వంపేసి...సింగపూర్ విమానాశ్రయానికి తిరిగొచ్చి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆస్ట్రేలియాకు చెందిన క్వాంటాస్ ఎయిర్ లైన్స్ కు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ఎయిర్ లైన్స్ గా పేరుంది. ఆ సంస్థ 90ఏళ్ళ చరిత్రలో ఒక్క విమానప్రమాదం కూడా చోటుచేసుకోలేదు. ప్రమాదానికి గురైన విమానం ఎయిర్ బస్ కంపెనీకి చెందిన 380 మోడల్ కావడంతో క్వాంటాస్ సంస్థ తమవద్ద ఉన్న ఆ మోడల్ విమానాలు ఆరింటిని వెంటనే నిలిపివేసింది.

Comments

  1. ఇదంతా ఒంగోలు శీను, శర్మ గారిని తిట్టిన పర్యవసానం. ఆగ్రహించిన సారమ గారు విమానాలపై ఉచ్చాటన క్రియ ప్రయోగించారు

    ReplyDelete
  2. ప్రజ్ఞ

    @అనానిమస్:నా బ్లాగ్ సందర్శించినందుకు థన్యావాదాలు. శర్మగారికీ, ఈ బ్లాగుకు ఏ విధమైన సంబంధం లేదండోయ్. నేను ఈ పోస్టును కేవలం ఒక వార్తలాగా రాశానంతే.

    ReplyDelete
  3. >>శర్మగారికీ, ఈ బ్లాగుకు ఏ విధమైన సంబంధం లేదండోయ్>>

    అంటే ఒంగోల్ శీను కి సంబంధం ఉందా?

    ReplyDelete
  4. యుగాంతం మొదలయిందేమో. కొందరు నరకాసురుడికి పూజలు మొదలెట్టారు. కలికాలం అనుకుని ఊర్కుంటున్నాం.

    ReplyDelete
  5. యుగాంతం మొదలయిందేమో. కొందరు నరకాసురుడికి పూజలు మొదలెట్టారు. కలికాలం అనుకుని ఊర్కుంటున్నాం.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఏపీ ఎన్నికలు: బలంగా ప్రభావం చూపనున్న నెగెటివ్ ఓటు!

  ఐదేళ్ళు ఒక పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత ఉండటం సహజం(ఇటీవలికాలంలో ఒడిషా, అప్పట్లో ప.బెంగాల్ వంటి కొన్ని అరుదైన సందర్భాలు తప్ప). అయితే వైసీపీ పాలనలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఏపీలో ధారాళంగా అందుతున్న సంక్షేమ పథకాల పుణ్యమా అని వైసీపీకి సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, మరోవైపు వ్యతిరేకులు కూడా పెద్ద సంఖ్యలోనే తయారయ్యారు. పోలింగ్ రోజున - జగన్ సానుభూతి పరుల సంకల్పం గట్టిగా ఉంటుందా, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ గెలవకూడదు అనే వర్గాల సంకల్పం గట్టిగా ఉంటుందా అనేదానిని బట్టి ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుంది... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి -   లింక్ .  

ఏపీలో ఏ వర్గం ఓట్లు ఎటువైపు? తటస్థ ఓటర్ల మద్దతు జగన్‌కా, కూటమికా?

  ఏపీలో సంఖ్యాపరంగా అతి పెద్ద వర్గం బీసీలు. వివిధ రాజకీయపార్టీలు బీసీ మంత్రాన్ని జపిస్తుంటాయిగానీ, రెడ్లు, కమ్మలు, కాపులు, ఎస్‌సీ మాలలవంటి కులాలలాగా బీసీలు గంపగుత్తగా ఒకవైపు ఓట్లు వేయటం జరగదు. ఎందుకంటే బీసీలు అంటే యాదవ, గౌడ, శెట్టిబలిజ, పద్మశాలి, మత్స్యకార వంటి అనేక వెనుకబడిన కులాల సమాహారం. రెడ్లు, కమ్మలు, కాపులు, ఎస్‌సీలలాగా బీసీలను ఒక్కటిగా కనెక్ట్ చేసే యూనిఫికేషన్ ఫ్యాక్టర్ ఏదీ ఉండదు. అయితే ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. బీసీలపై ప్రేమ వలనో, వారి ఓట్లపై ప్రేమవలనోగానీ, జగన్మోహన్ రెడ్డి వారికి ఈ ఎన్నికల్లో వారికి పెద్దపీట వేశాడు. కొన్నిచోట్ల తన కులాభిమానాన్ని కూడా పక్కనపెట్టి రెడ్లుకు కాకుండా బీసీలకు టిక్కెట్లు ఇచ్చాడు... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి -   లింక్ .

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని