Skip to main content

Posts

పూరిపాక హోటల్‌లో భోజనంకోసం క్యూలు కడుతున్న కార్లు!

అదొక రోడ్డుపక్క పూరిపాకలో ఉన్న హోటల్. కానీ ఆ హోటల్ లో భోజనం చేయటంకోసం ఎక్కడెక్కడినుంచో… ఆఖరికి చెన్నై, బెంగళూరు నగరాలనుంచి కూడా కార్లు వేసుకుని పనిగట్టుకుని వస్తారు. తమిళనాడులోని కోయంబత్తూరుకు 79 కిలోమీటర్ల దూరంలో హైవే పక్కన ఉన్న ఈ హోటల్ లో అన్నీ స్పెషాలిటీలే. పూర్తి వ్యాసం చదవటానికి ఇక్కడ క్లిక్ చేయండి!

తరుణ్ విజయ్‌కు దిమ్మతిరిగే జవాబు ఇదిగో!

సంఘ్ పరివార్‌కు చెందిన మాజీ ఎంపీ తరుణ్ విజయ్ దక్షిణాదివారిపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు తేనెతుట్టెను కదిపినట్లయిన సంగతి తెలిసిందే. ఉత్తర-దక్షిణ ప్రాంతవాసుల మధ్య చిరకాలంగా అంతరాంతరాలలో ఉన్న ఒక చిన్నపాటి వైషమ్యాన్ని తరుణ్ విజయ్ మళ్ళీ రాజేశారనే చెప్పాలి. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా దక్షిణాదిలో ఈ అంశంపై తీవ్రచర్చ జరుగుతోంది. ఇక సోషల్ మీడియాలో అయితే సంఘ్ పరివార్ మద్దతుదారులు, మిగతావారిమధ్య పెద్ద యుద్ధాలే జరుగుతున్నాయి.To Read Full Story, Click Here .

రాయల్ 'బుల్లెట్'పై పెరిగిపోతున్న మోజు: ఎందుకింత క్రేజ్!

తెలుగు సినిమాల్లో, ఆ మాటకొస్తే మనదేశంలో రూపొందే ఏ కమర్షియల్ సినిమాలోనైనా క్లైమాక్స్ సీనులో - బాధితులను ఆదుకోవటానికి, విలన్ బ్యాచిని చితకబాదటానికి హీరోగారు ఆఖరినిమిషంలో బయలుదేరటం సర్వసాధారణం. అలా బయలుదేరటానికి సదరు హీరోగారు వాడే వాహనాలు రెండే రెండు. గుర్రం లేదా 'బుల్లెట్' మోటార్ సైకిల్. ఆయన వాటిల్లో ఏదో ఒకదానిని తీసుకుని బయలుదేరగానే ఫ్రంట్ బెంచర్స్ ఉత్సాహానికి అంతు ఉండదు. హాలంతా ఈలలతో దద్దరిల్లిపోవాల్సిందే. అలా 'బుల్లెట్' మోటార్ సైకిల్ కు సినిమాఫీల్డ్ తో అవినాభావ సంబంధముంది. To Read full story, Click Here

కోదండరామ్ పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇదేనా!

ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని - సగటు తెలుగు కమర్షియల్ సినిమాలలో హీరోలాగా - ఒంటిచేత్తో కేసీఆర్, ఆయన నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ సాధించుకొచ్చినట్లు ఎవరైనా అంటే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు. ఈ రెండున్నరేళ్ళుగా కేసీఆర్ టైమ్ బాగుండటంతో ఆయనను ఇంద్రుడు, చంద్రుడు, అసహాయశూరుడు, మేరునగధీరుడు అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నవారు(ఈ గొర్రెలమందలో ఈమధ్య కొందరు ఆంధ్రోళ్ళుకూడా చేరటం ఒక విశేషం) ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాష్ట్ర సాధన ఘనతలో కేసీఆర్ కృషి మూడోవంతు మాత్రమే. To Read Full Story, Click Here.

సీఈఓ బాబుగారు ఈవెంట్ మేనేజర్ స్థాయికి పడిపోయారెందుకు!

ప్రస్తుతం ఉన్నస్థితినుంచి మెరుగైన స్థితికి వెళ్ళాలనుకోవటం మానవ నైజం . మరి మన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారేమిటి దీనికి రివర్సులో వెళుతున్నారు . నాడు 1995 నుంచి 2004 వరకు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్రతిహతంగా దాదాపు పదేళ్ళు పాలించిన బాబుగారు ఏపీకి తాను సీఈఓనని అప్పట్లో చెప్పుకున్న సంగతి తెలిసిందే ( కార్పొరేట్ సంస్కృతిపట్ల ఆ మోహంలో రెచ్చిపోయి వ్యవసాయం దండగ అనటమే ఆయన కుర్చీకిందకు నీళ్ళు తేవటం వేరే విషయమనుకోండి ). మరి పదేళ్ళతర్వాత గద్దెనెక్కిన ఆయనకు ఇప్పుడేమయిందోగానీ ఈవెంట్ మేనేజర్ స్థాయికి దిగిపోయారు . To Read Full Article, Click Here.

కోడెల సంచలన వ్యాఖ్యలపై నేషనల్ మీడియాలోనూ చర్చ!

వంటింటికి పరిమితమైతేనే ఆడవాళ్ళకు మంచిదనే అర్థంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్థానికంగా రెండు తెలుగురాష్ట్రాలలో పెద్ద ప్రభావం కనిపించకపోయినా జాతీయస్థాయిలో మాత్రం అవి పెద్ద దుమారాన్నే లేపాయి. మహిళాసంఘాల నేతలు, వివిధ రాజకీయపార్టీల నాయకులు కోడెలపై నిప్పులు చెరుగుతున్నారు. To Read Full story Click Here.

'వంగవీటి' కాదు 'దేవినేని' అంటున్నారు!

ఎల్లప్పుడూ ప్రజల నోళ్ళలో నానుతూ సంచలనంగా ఉండాలని కోరుకునే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం వంగవీటి నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. కోస్తా ఆంధ్ర రాజకీయాలలో, అదీ బెజవాడలో ఎవరూ మరిచిపోలేని నాయకుడు వంగవీటి మోహనరంగా కథ ఆధారంగా తీస్తున్న చిత్రం కావటంతో ఇది మొదటినుంచీ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కోస్తాలోని రెండు ప్రధాన కులాలకు సంబంధించిన సబ్జెక్ట్ అయినందున అంత సున్నితమైన అంశాన్ని వర్మ ఎలా డీల్ చేస్తాడా అని అందరిలో ఆసక్తి నెలకొంది. చిత్రం స్క్రిప్టు తయారీలో భాగంగా వర్మ రెండుసార్లు విజయవాడవెళ్ళి ఇరు వర్గాలనూ కలుసుకున్నారు. ఆయనకు దేవినేని సహకరించినప్పటికీ వంగవీటి కుటుంబం మాత్రం సానుకూలంగా స్పందించలేదు. దానికి కారణం వర్మ నిర్మాణంలో గతంలో రూపొందిన 'బెజవాడ' చిత్రంలో దేవినేని వర్గాన్నే హీరోగా చూపించటమేనని టాక్ వినబడింది. పూర్తి కథనం చదవటానికి ఇక్కడ క్లిక్ చేయండి.