Skip to main content

Posts

మరో వివాదంలో మోహన్‌బాబు:గౌరవ డాక్టరేట్ నకిలీదేనని నిర్ధారణ

డైలాగ్‌కింగ్ మోహన్‌బాబును మరో వివాదం చుట్టుముట్టింది . అయినా వివాదాలు ఆయనకు కొత్తకాదనుకోండి . ఈ సారి వివాదం ఆయనకు కొన్నేళ్ళక్రితం లభించిన గౌరవ డాక్టరేట్ పట్టాపై . అమెరికాలోని ఇంటర్నేషనల్ క్యాలిఫోర్నియా యూనివర్సిటీ మోహన్‌బాబుకు డాక్టరేట్ పట్టాఇచ్చి గౌరవించింది . అప్పటివరకు ఎన్టీఆర్ , ఏఎన్‌ఆర్ వంటి గొప్పనటులకు ఆంధ్రా యూనివర్సిటీయో , నాగార్జున యూనివర్సిటీ డాక్టరేట్‌లు ఇవ్వటంమాత్రమే చూసిన తెలుగువారికి మోహన్‌బాబు నేరుగా అమెరికానుంచే డాక్టరేట్ పట్టా పొందటం ఆశ్చర్యకరంగానూ , అపూర్వంగానూ అనిపించింది . ఈ అరుదైన ఘనత సాధించినందుకు ఆయనకు చెన్నైలో నాడు భారీఎత్తున సన్మానంకూడా జరిగింది . సదరు అమెరికా యూనివర్సిటీ ఒక పెద్ద ఫ్రాడ్ అని ఇప్పుడు తేలింది . ఈ సంస్థ మోహన్‌బాబుకేకాక మాజీ ఎంపీ రాజగోపాల్ నాయుడు ( మాజీ మంత్రి గల్లా అరుణతండ్రి ), మిసిమి పత్రిక ఎడిటర్ ఆలపాటి రవీంద్రనాథ్ వంటి మరికొందరు తెలుగువారికికూడా ఈ గౌరవ డాక్టరేట్‌లు ఇచ్చిందట . ఈ యూనివర్సిటీ వ్యవహారం తేడాగా ఉన్నట్లు గమనించిన నరిశెట్టి ఇన్నయ్యగారనే సీనియర్ తెలుగు జర్నలిస్ట్ అమెరికా వెళ్ళినపుడు దీనిపై పరిశోధన చేయగా ఆశ్చర...

సీమాంధ్రప్రాంతంలో 'హాట్ ఫేవరెట్' తెలుగుదేశమా!

సీమాంధ్రలో తెలుగుదేశంలోకి జంపింగ్‌లు, మీడియాలో వస్తున్న వార్తలనుబట్టిచూస్తే అక్కడ జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీయే 'హాట్ ఫేవరెట్'అన్న అభిప్రాయం కలగకమానదు. మరోవైపు తమ పార్టీలోకి వస్తున్న జంప్ జిలానీలను చూసి ఆత్మవిశ్వాసం పొంగి పొర్లుతున్న చంద్రబాబునాయుడు ఇప్పటికే సీమాంధ్ర సీఎమ్ అయిపోయినట్లు మాట్లాడుతున్నారు(ఇటీవల హైదరాబాద్‌లో 'మీట్ ది పీపుల్' అనే కార్యక్రమంలో  పాల్గొంటూ, ఆ కార్యక్రమానికి హాజరైన వివిధవర్గాలవారికి భారీ లెవల్‌లో హామీలు గుప్పించి సీమాంధ్ర ముఖ్యమంత్రిననే భావం అక్కడున్నవారికి కల్పించారట చంద్రబాబు). భారీస్థాయిలో   కాంగ్రెస్ నుంచి దూకుతున్న జంప్ జిలాని నాయకులతో తెలుగుదేశంపార్టీ కిటకిటలాడుతున్నమాట వాస్తవమే. ఓవర్‌ఫ్లోను తట్టుకోలేక కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి హౌస్‌ఫుల్ బోర్డ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి టీడీపీకి ఏర్పడిన మాటా నిజమే. అయితే దీనిని ఫలితాలకు సూచికగా తీసుకోవటం అమాయకత్వమే అవుతుంది. టీడీపీలోకి దూకుతోంది నాయకులేగానీ, ఓటర్లుకాదన్న విషయాన్ని మరిచిపోగూడదు. అసలు ఈ జంపింగ్ జపాంగ్‌లవలన విశాఖపట్నం, అనంతపురం, కర్నూలువంటి పలు జిల్లాలలో  ...

వర్మ మాటల్ని నిజం చేసిన పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావాలంటూ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ట్విట్టర్‌లో ఆమధ్య ట్వీట్ల వర్షం కురిపించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. వర్మ మాటల్ని పవన్ మొత్తానికి నిజం చేశారు. రాజకీయాల్లోకి రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇవాళో, రేపో పూర్తి వివరాలు తెలియనున్నాయి.  "పవన్ కళ్యాణ్‌లో నిజాయితీ ఉంది, చూట్టానికి బాగుంటాడు, సినిమాల్లో అయితే ధియేటర్లలోనే చూడాలి, రాజకీయాల్లోకి వస్తే న్యూస్ ఛానల్స్‌లో రోజూ చూడొచ్చు" అంటూ తన ట్వీట్లకు కారణాన్ని వర్మ నాడు వివరించాడు. అది వర్మశైలి వ్యంగ్యమో, మనసులోనుంచి వచ్చిన మాటో చెప్పలేముగానీ పవన్ కళ్యాణ్‌లో నిజాయితీ, కొన్ని సిద్ధాంతాలు, ఆదర్శాలు, సమాజానికి ఏదో చేయాలని(concern) ఉందని మాత్రం దాదాపుగా అందరూ అంగీకరిస్తారు. అధికారమో, డబ్బో మాత్రమే లక్ష్యమే అయితే తన వృత్తిలో అత్యద్భుతమైన దశకు చేరుకున్న ప్రస్తుతతరుణంలో దానిని పణంగా పెట్టి రాజకీయాలలో దిగడని టాలీవుడ్ వర్గాలు ముక్తకంఠంతో చెబుతున్నాయి. కానీ రాజకీయాలకు కేవలం నిజాయితీ, ఆదర్శాలు, పుస్తక పరిజ్ఞానం మాత్రమే ఉంటే సరిపోదన్నది అందరికీ తెలిసిన విషయమే. అందులోనూ సొంత అన్నగారైన ...

తెలుగువారి ఇంటింటా అలుముకున్న విచారం

తెలుగు సినీరంగమూలస్తంభాలలో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు మరణించారన్నవార్తతో ఈ ఉదయంనుంచి రాష్ట్రంలోని ప్రతిఇంటా ఒకరకమైన విషాదం అలుముకుంది . ప్రతివారూ తమ ఇంట్లోని వ్యక్తి ఎవరో చనిపోయినట్లు విచారిస్తున్నారంటే దానికి కారణం ఆరు దశాబ్దాలుగా అక్కినేని ఆయా తరాలపైవేసిన ముద్రే అని చెప్పాలి . ముఖ్యంగా ప్రస్తుతం 40 సంవత్సరాలు , ఆ పైన వయస్సులో ఉన్న తెలుగువారందరూ అక్కినేని చిత్రాలు చూస్తూ పెరిగినవారే కావటంతో వారందరి జీవితం , సంస్కృతిలో ఆయన ఒక భాగమైపోయారు . ఈ కారణాలన్నిటిరీత్యా అక్కినేని మరణవార్త వారిని విచారానికి గురిచేసింది . అందుకే ఆయన భౌతిక కాయం చూడటానికి అన్నపూర్ణ స్టూడియోకు సినీపరిశ్రమవారు , వీఐపీలు , బంధువులకంటే సామాన్యజనమే ఎక్కువమంది తరలివస్తున్నారు . ఉదయంనుంచీ దాదాపుగా ఇళ్ళలో ఉన్నవారందరూ వివిధ టీవీ ఛానళ్ళలోఅక్కినేని మృతిపైవస్తున్న లైవ్ కార్యక్రమాలను కళ్ళప్పగించి చూస్తున్నారు . ముఖ్యంగా నాగార్జున మధ్యమధ్యలో కంటినీరు పెట్టుకుంటుడటం , సంబాళించుకుని వచ్చేవారిని పలకరించటం , అక్కినేని కుటుంబసభ్యులందరూ ఎటూ వెళ్ళకుండా భౌతికకాయంవద్దే నిలబడిఉండటం టీవీలు చూస్తున్నవారందరినీ కదిలిస్తున్నాయి . అక్కినే...

నెట్‌లో లభిస్తున్న మీ ఇంటి శాటిలైట్‌మ్యాప్, ఫోటోలు చూసుకోండి!

మీరు లేదా మీవాళ్ళు హైదరాబాద్ నగరంలో ఉంటున్నట్లయితే , మీ ఇంటి శాటిలైట్ మ్యాపును , 360 డిగ్రీలలో ఫోటోలను చూసుకునే అవకాశాన్ని ఒక భారతీయసంస్థ కల్పిస్తోంది . వోనోబో . కామ్ (www.wonobo.com) అనే వెబ్ సైట్ ద్వారా మీరు మీ ఇంటి శాటిలైట్ మ్యాప్ , ఫోటోలు చూసుకోవచ్చు . ఆ వెబ్ సైటుకు వెళ్ళగానే , మీరు ఏ నగరం చూడాలనుకుంటున్నారని ప్రశ్న ఎదురవుతుంది . అక్కడున్న డ్రాప్ డౌన్ లోనుంచి హైదరాబాద్ నగరాన్ని ఎంచుకోవాలి . మీరు ఆ నగరాన్ని ఎంచుకుని ఎంటర్ నొక్కగానే చార్మినార్ ఫోటో కనిపిస్తుంది . అయితే మీరు చూడాలనుకున్న ప్రదేశంకోసం మీరు కుడివైపు కిందభాగంలో కనిపిస్తున్న మ్యాప్ పైన క్లిక్ చేయాలి . అప్పుడు స్క్రీన్ సగభాగంలో మ్యాప్ , సగభాగంలో ఫోటో కనిపిస్తాయి . ఆ మ్యాప్ ద్వారా మౌస్ ను కదిలిస్తూ మీరు వెళ్ళాలనుకున్న చోటికి వెళ్ళొచ్చు . అక్కడ మీరు చూడాలనుకున్న ప్రదేశం మ్యాప్ తోబాటు , 360 డిగ్రీలలో ఫోటోలు కూడా దర్శనమిస్తాయి . మీరు టెక్నాలజీ పెద్దగా పరిచయంలేనివారైతే , ఈ వెబ్ సైట్ మీకు పల్లెటూరుతప్ప మరేమీ తెలియనివారిని నగరం నడిబొడ్డున వదిలినట్లుగా , కొద్దిగా అయోమయంగానే ఉంటుంది . ఎవరినైనా సాయం తీసుకుంటే నేవిగేషన...

జూ.ఎన్‌టీఆర్‌ ఫెయిల్యూర్ ఫార్ములా

'రామయ్యా వస్తావయ్యా' ఓవర్సీస్ లో అతిపెద్ద ఫ్లాప్ గా రికార్డ్ సృష్టించిం దని తెలుగు సినిమా వెబ్ సైట్లు కోడై కూస్తున్నాయి . అదెంత నిజమోగా నీ తెలుగు ఇండస్ట్రీలో మంచి ట్యాలెంట్ , మాస్ అప్పీల్ ఉన్న జూ . ఎన్‌టీఆర్‌కు ఆది , సింహాద్రి స్థాయి ఘనవిజయం అందకుండా ఊరిస్తోందన్నది నిజం . యమదొంగ , బృందావనం , అదుర్స్ వంటివి విజయం సాధించినా అవి బ్లాక్ బస్టర్ హిట్స్ కాదన్నది అందరికీ తెలిసిన విషయమే . రామయ్యా వస్తావయ్యాకు ముందు వచ్చిన బాద్షా రు .40 కోట్లు వసూలుచేసిందని చెబుతున్నప్పటికీ , పెట్టుబడి పెట్టినవారెవరికీ లాభాలు రాలేదన్న సంగతి విదితమే . ఇక జూనియర్ ఫ్లాప్ లను ఒకసారి చూస్తే , ఇంత భారీ ఫ్లాపులు ప్రస్తుతమున్న హీరోలలో మరెవరికీ లేవనే చెప్పాలి . నరసింహుడు ఫ్లాపవడంతో ఆ సినిమా నిర్మాత చెంగల వెంకట్రావు హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ లో దూకితే , పెద్ద ఎన్టీయార్ , చిరంజీవిలతో ఎన్నో సూపర్ హిట్లిచ్చిన సుప్రసిద్ధ నిర్మాత చలసాని అశ్వనీదత్ , శక్తి సినిమా ఫ్లాప్ అవటంతో ఉంటున్న ఇల్లుకూడా అమ్ముకున్నాడని ఫిలింనగర్ లో చెప్పుకుంటుంటారు . ఈ స్థితికి కారణమెవరని ప్రశ్నిస్తే , జూనియర్ స్వయంకృతాపరాధమని...

మళయాళ నిర్మాతలను ప్రాధేయపడుతున్న అల్లు అర్జున్

కేరళలోని మళయాళ మనోరమగ్రూప్ కు చెందిన ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ 'మళవిల్ మనోరమ' ఓనమ్ సందర్భంగా, ఈనెల 15న తమ ఛానల్ లో 'మల్లు' అర్జున్‌ ఇంటర్వ్యూను ప్రసారం చేసింది. అరగంటకుపైగా సాగిన ఆ కార్యక్రమంలో అతనిని వ్యక్తిగత విషయాలగురించి తెలుగులోకూడా ఎవరూ అడగనంత వివరంగా, చిన్న చిన్న వాటినికూడా ప్రస్తావిస్తూ ఆ ఛానల్ ప్రతినిధి ఇంటర్వ్యూ చేసింది.  అతనిని మళయాళ ప్రేక్షకులు ఎంత నిశితంగా గమనిస్తున్నారనేది, అతనికి అక్కడ ఎంత ఫాలోయింగ్ ఉందనేది ఆ యాంకర్ మాటలనుబట్టి అర్థమవుతోంది .  ప్రతి సినిమాలోనూ అల్లు అర్జున్ ను మొదట హీరోయిన్ ఇష్టపడదని , చివరకు మాత్రం అతను ఆమె హృదయాన్ని , ప్రేక్షకుల సానుభూతిని గెలుచుకుంటాడంటూ ఆర్య , హ్యాపీ , జులాయి చిత్రాలను ఉదాహరణలుగా చూపిస్తూ విశ్లేషించింది . రెడ్ బుల్ త్రాగినట్లు  అంతబాగా డాన్స్ లు చేయటానికి ఎనర్జీ ఎక్కడనుంచి వస్తుందని ప్రశ్నించింది . మళయాళ యువత అతనంటే ఊగిపోతున్నారని, ఏ మూలకు వెళ్ళినాఅల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ బోర్డ్ కనబడుతోందని ఆ యాంకర్ చెప్పింది.                           క...