తెలుగు సినీ పరిశ్రమకు పెద్దదిక్కు లేకుండా పోయిందంటూ మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు నర్మగర్భంగా ఉన్నాయని పలు చోట్ల రాస్తున్నారు. కానీ, అతను సూటిగానే ఒక విషయాన్ని ఢంకా బజాయించి చెబుతున్నారు. ప్రస్తుతం తెలుగు పరిశ్రమకు ఉన్నంతలో చిరంజీవే పెద్ద దిక్కు అని తమ్మారెడ్డి భరద్వాజ, మురళీ మోహన్ వంటి కొందరు ప్రముఖులు అక్కడక్కడా వినిపిస్తున్న వాదనను తాము(మంచు ఫ్యామిలీ) అంగీకరించబోమన్నది అతని వ్యాఖ్యల అంతరార్థం. వివాదాలకు మారుపేరు, చిరంజీవి ఆధిపత్యాన్ని అడుగడుగునా సవాల్ చేసే మోహన్ బాబు ఇలా తన కుమారుడితో వ్యాఖ్యలు చేయించటం సహజ పరిణామమే కాబట్టి అంతవరకు బాగానే ఉంది. కానీ, ఇక్కడ చిన్న తిరకాసు ఉంది. ఇటీవలికాలంలో మంచు వారు తమ సినిమాలు అన్నింటికీ చిరంజీవితోనే ప్రమోషన్ చేయిస్తున్నారు, మరోవైపు పెద్దదిక్కుమాత్రం అతనుకాదు అంటున్నారు, ఈ మతలబు ఏమిటీ అని అటు ఇండస్ట్రీలోనివారు, ఇటు ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. దీనిలో నిజంలేకపోలేదు. పూర్తి వ్యాసం చదవటానికి ఈ లింక్ లోకి వెళ్ళండి .
ఆనోభద్రా క్రతవోయంతు విశ్వత: Let noble thoughts come from all sides