Skip to main content
గ్రేటర్‌లో జనం గుణపాఠం చెప్పవలసింది కేసీఆర్‌కా, బీజేపీకా?
రేపటి ఎన్నికల విషయంలో హైదరాబాద్ ప్రజలు ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. వరదనీటితో అతలాకుతలమై, రోజుల తరబడి సొంత ఇళ్ళలో ఉండలేక ఎక్కడెక్కడో తలదాల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే కనీసం పలకరించటానికి కూడా దొరకు తీరిక దొరకలేదు, ఓట్లు అడగటానికి మాత్రం తయారై వచ్చేశాడని జనం మండిపడుతున్నారు. చివరకు టీఆర్ఎస్ సానుభూతిపరులు కూడా ఈసారి కారుకు గట్టి ధమ్కీ తగలితేనే కేసీఆర్ సరిగ్గా సెట్ అవుతాడు, అహంకారం దిగిపోతుంది అనుకుంటున్నారంటే జనం అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. డిసెంబర్ 4న వెలువడే ఫలితాల్లో టీఆర్ఎస్‌కు మైండ్ బ్లాక్ అయ్యే దెబ్బ తగలబోతుందనేది సుస్పష్టం. అయితే, ప్రజల పల్స్ ఇలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంటే, సీపీఐ నారాయణ మాత్రం నిన్న ఒక కొత్త పాయింట్ తీశారు. ఒక బక్కాయనను ఎదుర్కోటానికి ఇంతమంది కాషాయ బాహుబలులా అని ప్రశ్న లేవనెత్తారు. పూర్తి వ్యాసం చదవాలనుకుంటే ఈ లింక్ లోకి వెళ్ళండి.
"కారుకు గట్టి ధమ్కీ తగలితేనే కేసీఆర్ సరిగ్గా సెట్ అవుతాడు"
ReplyDeleteధమ్కీ= బెదిరింపు కనుక తగలదు ఢక్కా అనబోయి ధమ్కీ అన్నట్టున్నారు
అవునండి. Thank you. పొరబడ్డాను. సరిచేశాను.
Deleteఊరందరిది ఒక దారి ఉలిపికట్టెది మరోదారి
ReplyDeleteశర్మగారూ, మీ వ్యాఖ్య అర్థం కాలేదు. వీలైతే వివరించగలరు. Thank you. 🙂
Delete
Deleteహైదరాబాద్ ప్రజలంతా ఒకలా మాటాడుతుంటే నారాయణ గారొక్కడు వేరుగా మాటాడుతున్నాడన్నదే ఆ సామెతకి అర్ధమండి.
Okay. Thank you sir for your clarification. నేను మీ బ్లాగ్ అభిమానిని. 🙂
DeleteThanbk you sir
Deleteఆ నారాయణకు kcr కంటే bjp అంటే ఎక్కువ అసహ్యం. ఆదన్నమాట విషయం!
ReplyDeleteయువకుడు అయిన తేజస్వి యాదవ్ ని ఎదుర్కోవడానికే అంత మంది మహామహులు పోరాడి చావు తప్పి కన్ను లొట‌్టపోయినట్టు గెలిచారు. మరి KCR అంటే మాటలా?
ReplyDelete