రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు చకచకా మారిపోతున్నాయి. తెలంగాణలో సంఘటితమవుతున్న రెడ్లకు, కేసీఆర్ వ్యతిరేకులకు రేవంత్ ఒక ఆలంబనగా మారేటట్లున్నారు. దీనితో వచ్చే ఎన్నికలనాటికి తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి. 2019 ఎన్నికల్లో ముఖాముఖి పోటీ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. To Read Full Story, Click Here.
రేపటి ఎన్నికల విషయంలో హైదరాబాద్ ప్రజలు ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. వరదనీటితో అతలాకుతలమై, రోజుల తరబడి సొంత ఇళ్ళలో ఉండలేక ఎక్కడెక్కడో తలదాల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే కనీసం పలకరించటానికి కూడా దొరకు తీరిక దొరకలేదు, ఓట్లు అడగటానికి మాత్రం తయారై వచ్చేశాడని జనం మండిపడుతున్నారు. చివరకు టీఆర్ఎస్ సానుభూతిపరులు కూడా ఈసారి కారుకు గట్టి ధమ్కీ తగలితేనే కేసీఆర్ సరిగ్గా సెట్ అవుతాడు, అహంకారం దిగిపోతుంది అనుకుంటున్నారంటే జనం అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. డిసెంబర్ 4న వెలువడే ఫలితాల్లో టీఆర్ఎస్‌కు మైండ్ బ్లాక్ అయ్యే దెబ్బ తగలబోతుందనేది సుస్పష్టం. అయితే, ప్రజల పల్స్ ఇలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంటే, సీపీఐ నారాయణ మాత్రం నిన్న ఒక కొత్త పాయింట్ తీశారు. ఒక బక్కాయనను ఎదుర్కోటానికి ఇంతమంది కాషాయ బాహుబలులా అని ప్రశ్న లేవనెత్తారు. పూర్తి వ్యాసం చదవాలనుకుంటే ఈ లింక్ లోకి వెళ్ళండి.

Comments
Post a Comment