Skip to main content

రామోజీ - జగన్‌ భేటి: తెరవెనక కథేంటి?


వ్యాపారపరంగా, రాజకీయంగా బద్ధశత్రువులైన జగన్మోహన్ రెడ్డి, రామోజీరావు ప్రత్యేకంగా భేటీకావటం తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది. జగన్ నిన్నసాయంత్రం తమ పార్టీ సీనియర్ నాయకుడు భూమన కరుణాకరరెడ్డితో కలిసి రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళి రామోజీరావుతో భేటీ అయ్యారు...Read The Full Story Here

Comments

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని...

30వ రాష్ట్రంగా రాయలసీమ! రాజుకుంటున్న 'ప్రత్యేక' ఉద్యమం

అసమానతలనుంచి అసంతృప్తి పుట్టుకొస్తుంది. అసంతృప్తినుంచి ఆక్రోశం పెల్లుబుకుతుంది. రాయలసీమ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అసంతృప్తితో సీమవాసులు రగిలిపోతున్నారు. ఏళ్ళ తరబడి వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. Read Full Story Here.

ఏపీ ఎన్జీఓల సభ విజయవంతం

సభను అడ్డుకుంటామని తెలంగాణవాదులు , జరపాలన్న కృతనిశ్చయంలో ఎన్జీఓలు ఇరువైపులా మోహరించి ఉంటడంతో ఎప్పుడేమి జరుగుతుందో అని శనివారం ఉదయంనుంచి హైదరాబాద్ వాసులు ఉత్కంఠతతో ఊపిరి బిగబట్టి చూశారు . మొత్తానికి చెదురుమదురు ఘటనలు మినహా సభ సాఫీగా సాగిపోయింది . సభ నిర్వాహకులను , ముఖ్యంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని దీనికి అభినందించాలి . మోరల్ సపోర్ట్ , లాజిస్టిక్ సపోర్ట్ , లా అండ్ ఆర్డర్ సపోర్ట్ ... ఒకటేమిటి అన్ని సపోర్టులూ అందించి సభను విజయవంతం చేయించారు కిరణ్ . ఏపీ ఎన్జీఓలు ఈ వేదికను చక్కగా సద్వినియోగం చేసుకున్నారు . సమైక్యవాదానికి తమ కారణాలను , తమ వాదనను స్పష్టంగా వినిపించారు . విభజన వలన నష్టాలను వివరించడంకూడా ఈ సభ లక్ష్యమైనప్పటికీ , వక్తలలో అశోక్ బాబు తప్పితే మిగిలిన ఉద్యోగసంఘాల నాయకులెవరూఆ విషయాలపై పెద్దగా దృష్టిపెట్టలేదు . సభలో వక్తల ఉపన్యాసాలుసంయమనంతో సాగాయని చెప్పొచ్చు . ఎవరైనా శృతి మించినా , అశోక్ బాబు వెనకనుంచి వారిని వారించడంతో వక్తలు మళ్ళీ గాడిలోకి వచ్చారు . వక్తలలో అశోక్ బాబు తర్వాత మిత్రా , సత్యవాణి ప్రసంగాలు ఆకట్టుకున్నాయి . ఇంకా పలువురు వక్తలు ప్రసంగించాల్సి ఉన్...