కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తాను కేంద్రమంత్రిననే విషయాన్ని మరిచిపోయి ఏపీ రాష్ట్రానికి ప్రతినిధిలాగా వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. నీతిఆయోగ్ బృందాన్ని తన ఇంటికి పిలిపించుకుని ఏపీకి చెందిన అంశాలపై మాట్లాడటంపై మండిపడ్డారు. దీనిని టీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. వెంకయ్యనాయుడు విభజనతో ఏపీ నష్టపోయినట్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. Read Full Story Here.
రేపటి ఎన్నికల విషయంలో హైదరాబాద్ ప్రజలు ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. వరదనీటితో అతలాకుతలమై, రోజుల తరబడి సొంత ఇళ్ళలో ఉండలేక ఎక్కడెక్కడో తలదాల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే కనీసం పలకరించటానికి కూడా దొరకు తీరిక దొరకలేదు, ఓట్లు అడగటానికి మాత్రం తయారై వచ్చేశాడని జనం మండిపడుతున్నారు. చివరకు టీఆర్ఎస్ సానుభూతిపరులు కూడా ఈసారి కారుకు గట్టి ధమ్కీ తగలితేనే కేసీఆర్ సరిగ్గా సెట్ అవుతాడు, అహంకారం దిగిపోతుంది అనుకుంటున్నారంటే జనం అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. డిసెంబర్ 4న వెలువడే ఫలితాల్లో టీఆర్ఎస్‌కు మైండ్ బ్లాక్ అయ్యే దెబ్బ తగలబోతుందనేది సుస్పష్టం. అయితే, ప్రజల పల్స్ ఇలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంటే, సీపీఐ నారాయణ మాత్రం నిన్న ఒక కొత్త పాయింట్ తీశారు. ఒక బక్కాయనను ఎదుర్కోటానికి ఇంతమంది కాషాయ బాహుబలులా అని ప్రశ్న లేవనెత్తారు. పూర్తి వ్యాసం చదవాలనుకుంటే ఈ లింక్ లోకి వెళ్ళండి.
> వెంకయ్యనాయుడు విభజనతో ఏపీ నష్టపోయినట్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు!
ReplyDeleteవిభజనతో ఏపీ నష్టపోయినట్లుగా చూపించే ప్రయత్నం ఒకటి ఎవరన్నా చేయాలా? కళ్ళూ చెవులూ ఉన్నవాళ్ళకి అది తెలియని విషయమా?
>వెంకయ్యనాయుడు ఆంధ్రా తరపున మాట్లాడకూడదా?
ఏమో! ప్రపంచంలో అందరూ ఒక్క తెలంగాణా తరపున మాట్లాడటమే బాధ్యతగా జన్మించారని అనుకుంటున్నారేమో!
అయినా మన వెంకయ్యగారివి శుష్కప్రియాలూ - శూన్యహస్తాలూ అన్నసంగతి ఎవరికి తెలియదూ అని!
హోదాపై వెనక్కు తగ్గంఏపీకి స్పెషల్ స్టేటస్ అంశంలో కేంద్రం వెనక్కి తగ్గలేదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు.ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేకంగా సాయం అందించడం, పరిశ్రమలకు రాయితీలపై.. నీతి ఆయోగ్
ReplyDelete