రేపటి ఎన్నికల విషయంలో హైదరాబాద్ ప్రజలు ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. వరదనీటితో అతలాకుతలమై, రోజుల తరబడి సొంత ఇళ్ళలో ఉండలేక ఎక్కడెక్కడో తలదాల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే కనీసం పలకరించటానికి కూడా దొరకు తీరిక దొరకలేదు, ఓట్లు అడగటానికి మాత్రం తయారై వచ్చేశాడని జనం మండిపడుతున్నారు. చివరకు టీఆర్ఎస్ సానుభూతిపరులు కూడా ఈసారి కారుకు గట్టి ధమ్కీ తగలితేనే కేసీఆర్ సరిగ్గా సెట్ అవుతాడు, అహంకారం దిగిపోతుంది అనుకుంటున్నారంటే జనం అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. డిసెంబర్ 4న వెలువడే ఫలితాల్లో టీఆర్ఎస్‌కు మైండ్ బ్లాక్ అయ్యే దెబ్బ తగలబోతుందనేది సుస్పష్టం. అయితే, ప్రజల పల్స్ ఇలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంటే, సీపీఐ నారాయణ మాత్రం నిన్న ఒక కొత్త పాయింట్ తీశారు. ఒక బక్కాయనను ఎదుర్కోటానికి ఇంతమంది కాషాయ బాహుబలులా అని ప్రశ్న లేవనెత్తారు. పూర్తి వ్యాసం చదవాలనుకుంటే ఈ లింక్ లోకి వెళ్ళండి.
ఆనోభద్రా క్రతవోయంతు విశ్వత: Let noble thoughts come from all sides
సదరు విద్యుత్ ఉద్యోగులు ఆంధ్రులు. వారిని రిలీవ్ చేయడం వల్ల తెలంగాణా రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ నష్టం లేదు సరికదా లాభమే. తెలంగాణా ఉద్యోగులు కోరుతున్నది కూడా అదే కనుక తెలంగాణా ప్రభుత్వ చర్య ప్రజాభీష్టానికి అనుగుణమని తెలుస్తుంది.
ReplyDeleteజై గారూ! వివాదాలవల్ల ఇరురాష్ట్రాల ప్రజలూ నష్టపోతున్నారన్నది ఈ ఆర్టికల్‌కు తీసుకున్న లైన్. విభజన తర్వాత ఇరు రాష్ట్రాలలో ఎక్కువ నష్టపోయిన రాష్ట్రం ఏదని మీ ఉద్దేశ్యం? obviousగా తెలంగాణకే నష్టం అని చెబుతారు. కొద్దిగా objectiveగా చెప్పటానికి ట్రై చెయ్యండి.
ReplyDeleteతేజస్వి గారూ మీరు మాట్లాడుతున్నది ఉద్యోగుల విభజన గురించేనా?
Deleteఆంద్ర అధికారులకు తెలంగాణాలో పదవులు కట్టపెట్టడం మన ప్రయోజనాలకు వ్యతిరేకం కనుక వారిని ఆంధ్రకు బదిలీ చేయడం మంచిదే. ఇందుకు తెలంగాణా ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సిందే.