హైదరాబాద్‌లో గురువారంరాత్రి జరిగిన లెజెండ్ విజయోత్సవ సభలో హీరో బాలయ్య చిరంజీవి, మోహన్‌బాబులపై చెణుకులు విసిరారు. లెజెండ్ టైటిల్‌గురించి వివరించే సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ టైటిల్ మాస్కు అర్థమవుతుందో, లేదోనని మొదట సందేహించామని తెలిపారు. అయితే ఆమధ్య కొందరు లెజెండ్ ఎవరంటూ కొట్టుకుని ఆ పదాన్ని పాపులర్ చేశారంటూ లెజెండ్ పురస్కారంపై గతంలో మోహన్‌బాబు, చిరంజీవి మధ్య జరిగిన గొడవను పరోక్షంగా ప్రస్తావించారు. తాము ఈ టైటిల్ పెట్టటంద్వారా అసలు లెజెండ్ ఎవరో, ఏమిటో ప్రేక్షకులకు చూపించామన్నారు.
సినీపరిశ్రమలోగానీ, రాజకీయాలలోగానీ తన తండ్రి ఎన్టీరామారావు ఒక్కరే లెజెండ్ అని బాలయ్య చెప్పారు. ఇది తన ఒక్కడి అభిప్రాయం కాదని, అందరిదీనన్నారు. ఎన్టీఆర్‌ను మరిచిపోయి లెజెండ్ ఎవరు...ఎవరు అని వెతికేవారు పిచ్చివాళ్ళని, అలా వెతికేవారికి పిచ్చెక్కిందేమోనని ప్రజలు అనుకుంటారని(#*@!?*#!) చెప్పారు.
తెలుగు సినీపరిశ్రమ వజ్రోత్సవాలలో లెజెండ్ అంటూ కొందరికి పురస్కారాలు ఇస్తూ తనను పట్టించుకోకపోవటంపై తాను లెజెండ్ కాదా అంటూ మోహన్‌బాబు గొడవకు దిగటం, చిరంజీవి దానికి ఆవేశపూరితంగా సమాధానం ఇవ్వటం తెలిసిందే.
బాలయ్య చెప్పిన మాటలను యధాతధంగా చూడాలనుకుంటే ఈ లింక్‌లోని వీడియోను చూడండి - https://www.youtube.com/watch?v=-KCRJIuj0vc#t=77
బాలయ్య చెప్పిన మాటలను యధాతధంగా చూడాలనుకుంటే ఈ లింక్‌లోని వీడియోను చూడండి - https://www.youtube.com/watch?v=-KCRJIuj0vc#t=77
మరే! మా నాన్న, మా బాబయి, నెను, మా పిల్లలు మాత్రమే లెజెండ్స్ అంటే
ReplyDeleteAsahyangaa...siggulekundaa aa viggemitraabaaboo nija jeevitamlo koodaa .
ReplyDeleteNija jeevitamlo kooDaa mosamenaa
Useless people...put this guy in a zoo..behind a enclosure...hate to see his action...dialogues..
ReplyDelete