అవును, గతవారం ముగిసిన తమిళ్ బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ ను గెలుచుకున్న ముగేన్ రావు మలేషియా దేశానికి చెందిన తెలుగు సంతతి కుర్రాడు. టీనేజ్ లో గ్యాంగ్ స్టర్ లాగా అవ్వాలని అనుకుని, తిరిగి ఆ దారిని వదిలి సింగర్ గా మారి ఇప్పుడు రాత్రికి రాత్రి ఒక సెలబ్రిటీ అయిపోయిన ఈ 24 ఏళ్ళ యువకుడి ప్రస్థానం అనూహ్యం, విలక్షణం. పూర్తి కథనం చదవటానికి ఇక్కడ క్లిక్ చేయండి.
రేపటి ఎన్నికల విషయంలో హైదరాబాద్ ప్రజలు ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. వరదనీటితో అతలాకుతలమై, రోజుల తరబడి సొంత ఇళ్ళలో ఉండలేక ఎక్కడెక్కడో తలదాల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే కనీసం పలకరించటానికి కూడా దొరకు తీరిక దొరకలేదు, ఓట్లు అడగటానికి మాత్రం తయారై వచ్చేశాడని జనం మండిపడుతున్నారు. చివరకు టీఆర్ఎస్ సానుభూతిపరులు కూడా ఈసారి కారుకు గట్టి ధమ్కీ తగలితేనే కేసీఆర్ సరిగ్గా సెట్ అవుతాడు, అహంకారం దిగిపోతుంది అనుకుంటున్నారంటే జనం అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. డిసెంబర్ 4న వెలువడే ఫలితాల్లో టీఆర్ఎస్‌కు మైండ్ బ్లాక్ అయ్యే దెబ్బ తగలబోతుందనేది సుస్పష్టం. అయితే, ప్రజల పల్స్ ఇలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంటే, సీపీఐ నారాయణ మాత్రం నిన్న ఒక కొత్త పాయింట్ తీశారు. ఒక బక్కాయనను ఎదుర్కోటానికి ఇంతమంది కాషాయ బాహుబలులా అని ప్రశ్న లేవనెత్తారు. పూర్తి వ్యాసం చదవాలనుకుంటే ఈ లింక్ లోకి వెళ్ళండి.

Comments
Post a Comment