Skip to main content

30వ రాష్ట్రంగా రాయలసీమ! రాజుకుంటున్న 'ప్రత్యేక' ఉద్యమం



అసమానతలనుంచి అసంతృప్తి పుట్టుకొస్తుంది. అసంతృప్తినుంచి ఆక్రోశం పెల్లుబుకుతుంది. రాయలసీమ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అసంతృప్తితో సీమవాసులు రగిలిపోతున్నారు. ఏళ్ళ తరబడి వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ రాయలసీమ వాసులు మండిపడుతున్నారు.Read Full Story Here.

Comments

  1. Replies
    1. ఓహో మీకెంత సంతోషంగా ఉందో! ఎందుకలా All the best! అభినందించేస్తున్నారు? ఆంధ్రాప్రాంతం ఎంతలా ముక్కలుచెక్కలైతే అంత ఆనందమా మీకు? ఇతరులకు చెడు జరగాలని కోరుకోవటం అంత మంచిది కాదనుకుంటానండీ. అలాకాదు అంటారా? ఐతే సరే, ప్రత్యేక హైదరాబాదు ఉద్యమమూ రావాలని కోరుకోండి దయచేసి. హైదరాబాదు సంపాదిస్తే మిగతా తెలంగాణావారు కూర్చుని బొక్కటాన్ని హైదరాబాదు వారూ దోపిడీ కిందే లెక్కిస్తారు మరి - ఈ వేళకాకపోతే రేపైనా అలాంటి పరిస్థితి రావచ్చును. అప్పుడు ఆంధ్రాలోని జనమూ ఇక్కడ అభాగ్యనగరంలో చిక్కుకున్న ఆంధ్రాజనమూ కూడా ప్రత్యేక హైదరాబాదు ఉద్యమానికి All the best! అని చెప్పాలని కూడా కోరుకోండి మరి. శుభమస్తు.

      ఇలా ప్రాంతీయతలు ఉపప్రాంతీయతలతో కుంటిసాకులతో దొంగవేషాలతో మనలో మనమే తన్నుకుని దేశాన్ని ముక్కలు చెక్కలు చేసుకొని సంబరాలు చేసుకుంటే, చరిత్ర పునరావృతం కాకతప్పదు - దేశానికి మళ్ళీ బానిసత్వమూ తప్పదు. అందుకని అందరమూ తస్మాత్ జాగ్రత జాగ్రత అనుకోవలసినదే. దయచేసి సావధానంగా అలోచించండి. రాజకీయ దృక్పథాలూ, ప్రాంతీయ సంకుచితత్త్వాలూ మనకు ఏమీ మేలు చేసేవిగా లేవు.

      Delete
    2. మాస్టారూ, రాయలసీమలో ప్రత్యెక రాష్ట్రం కోసం ఉద్యమం రావాలని నేను కోరుకోలేదు. ఆంద్ర రాష్ట్రంలో సీమ ప్రయోజనాలు నేరవేరవని, ప్రత్యెక రాయలసీమ రాష్ట్రం వారి సమస్యలకు అవసరమని కొందరు సీమవాసులు భావిస్తున్నారని వ్యాసంలో చెప్పారు. రాజ్యాంగ పరిధిలో వారు తమ అవసరాలను రక్షించుకునే ప్రయత్నానికి నా స్థాయిలో ఉడతాభక్తిగా సంఘీభావం తెలపడం పాపం కాదని మనవి.

      1953లొ ఉమ్మడి మదరాసు రాష్ట్రాన్ని విడగ్గొట్టి ఆంద్ర రాష్ట్రం నుండి మొదలు పెడితే "ఇదిగో ఇది దేశ విచ్చిన్నానికి (లేదా తిరిగి బానిసత్వానికి) మొదటి మెట్టు" అని ఎందరో ఎన్నోసార్లు అన్నారు. All these Cassandra predictions have proven false.

      ఆంద్ర అయినా తెలంగాణా అయినా కేవలం ఒక association of people మాత్రమె తప్ప మనుషుల కంటే గొప్పవి కావు. ప్రజా ప్రయోజనాల ముందు మాపులు దేనికీ కొరగావన్నది చరిత్ర చెప్పిన కఠోర సత్యం.

      నేను హైదారాబాదులోనే పుట్టి పెరిగాను. ఉద్యోగ రీత్యా బయట ఉన్న కొద్ది ఏళ్ళు తప్ప జీవితమంతా ఇక్కడే ఉన్నాను. ఇక్కడి ప్రతి గల్లీ, ప్రతి చెరువు, ప్రతి ఇరానీ హోటల్, ప్రతి కట్టడం వగైరాలు అన్నిటితో నాకు ఆత్మీయత & అనుబంధం ఉన్నాయి. నా గుడి నా దర్గా రెండూ ఈ నగరమే. Unlike many others who live here I can only sing "jeena yaha marna yaha, iska siwa jaana kaha"

      హైదరాబాద్ ప్రయోజనాలు తత్తిమ్మా తెలంగాణా జిల్లాలతో ముడిపడి ఉన్నాయని నా ప్రగాఢ నమ్మకం. ఇది వాస్తవం కాదని & అపోహని తెలిసిన తక్షణం ప్రత్యెక హైదరాబాద్ నినాదం నేనే ఎత్తుతాను లేదా అప్పటికే ఉద్యమం మొదలయితే కుదిరినంత చురుగ్గా పాల్గొంటాను.

      ప్రాంతీయ వాదం మాత్రమె సంకుచితం ఇతర (మతం, కులం, భాష వగైరాలు) ప్రాతిపదికలు కావనే వాదనతో ఏకీభవించనందుకు మన్నించండి. నిజానిజాలు పెరుమాళ్ళకు ఎరుక అనేది పక్కన పెడితే తమిళులు ఆంధ్రులను అణిచి వేసారనడం & ఆంధ్రులు సీమ వారిని ఎదగనివ్వలేదనడం రెండూ ఒకే తాటి మీద పరిగణించాలి.

      Delete
    3. ప్రత్యెక సీమ వాదుల వాదనలు నిజం కావని & ఉమ్మడి రాష్ట్రంలోనే వారికి మేలు జరుగుతుందని అనుకున్న వారికి అందరికీ నా విన్నపం ఒక్కటే. మీ వాదనల ద్వారా వారిని సముదాయించండి, అవసరం అనిపిస్తే ఇచ్చి పుచ్చుకొనే ధోరణి అవలంబించండి.

      Use of force will prove counter productive.

      Delete
  2. బాబు, జగన్‌లు ప్రత్యేక రాయలసీమకి ఎలాగూ ఒప్పుకోరు కనుక ప్రత్యేక రాయలసీమ ఉద్యమం వస్తే తెలుగు దేశం, వైకాపాలు నష్టపోయి కాంగ్రెస్ తిరిగి బలపడొచ్చు. కానీ కాంగ్రెస్‌లోని ఆంధ్రా నాయకులు కూడా ప్రత్యేక రాయలసీమకి ఒప్పుకోరనే నా అనుమానం.

    ReplyDelete
  3. జై గారికి, శ్యామలీయం గారికి, మార్క్సిస్ట్ హెగెలియన్ గారికి - మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు కృతజ్ఞతలు.

    ReplyDelete
  4. విడిపోవాలనే కోరికలో న్యాయం ఉంటే యెవరూ కాదనరు!సాంకేతికంగా ఇవ్వాళ్తి పరిస్థితి అంచనా వేసి చూసినా తెలంగాన కంతే రాయలసీమయే మహా భీబత్సంగా ఉంటే తెలంగాన వారు ఇవ్వాళ మిగులులో ఉందే పరిస్థితి ఉంటుందని తెలిసీ యెలా విడిపోగలిగారు?

    ఉద్యమకారుల్లో యే ఒక్కరూ కలిసి కూర్చుని చర్చించుకుని ప్రశాంతంగా విడిపోదామన్న పిలుపుకి సానుకూలంగా స్పందించలేదు,ఎంతసేపూ మందబలంతో అణిచేస్తారు అన్న తింగరి కబుర్లే తప్ప,ఏ సభలఓ నైనా మెజార్టీ అన్నది అవస్రమే అయినా ఒక సభ్యుడు దేన్నయినా ప్రతిపాదించేతప్పుడు మొదటే మందబలం తయారయిపోతుందా?చర్చ జరిగిన తర్వాత న్యాయ్మ్ యెతువైపు ఉంతే అటువైపే మెజాఋతీ మొగ్గు చూపుతారు కదా?ఇవ్వాళ కెమెరాలూ,మీడియా కన్నూ అక్కడే ఫోకస్ అవుతున్నప్పుడు మందబలం పనిచస్తున్నదని సాక్ష్యాలు చూపించి ప్రజల్లోకి వెళ్తే ఆంధ్రపరజలు కూడా తెలంగాణ ఉద్యమాన్ని నిండూమనస్సుతో సమర్ధించేవాళ్ళు,అది చెయ్యకుండా "ఆంధ్రద్వేషం" రెచ్చగొట్టి అయినా తెలంగాణ ప్రజానీకంలో తగిన ప్రోత్సాహం రాక ఆర్టికిల్ మూదును అడ్డం పెట్టుకుని బిల్లుని నెగ్గించుకోవటానికి తగిన బలం లేకపోయినా స్పీకరు నాకు కనపదలేదని సాకు చెప్పేసిన బుకాయింపులతె జరిగింది!ఇంతోటి న్యాయవర్తులు ఇంకోళ్లకి ఆల్ ది బెస్ట్ చెప్పటం:-)

    ప్రస్తుతం రాయలసీమ పొలిటీషియన్లు తెలంగాణ ఔద్యమాన్ని ఇమిటేట్ చెయ్యాలని చూస్తున్న్నారు,"400 టియంసీలు ఇస్తారా,విడిపొమ్మంటారా?" అనే రకం బ్లాక్ మెయిల్ చెయ్యటాలు న్యాయపోరాటాలా?అమరావతి శంకుస్థాపనకి వెళ్ళవద్దని ప్రకటించిన్నా రాయలసీమ నుంచీ జనం యెక్కువే వచ్చారు,గమనించండి!

    రాయలసీమ నాయకుల తెలివి యెలా ఉందో చూదండి?హోదా కోసం ఒక రాయలసీమ వ్యక్తి ఆత్మాహుతి చేసుకుంటే,"ప్రత్యేకహోదా సాధించతం కృష్ణాజిల్లా వాళ్ళ సమర్ధతకి సంబంధించిన వ్యవహారం.రాయలసీమ వాడు దానికోసం చావడమేంటి?ప్రత్యేఅక రాయలసీమ కోసం చావాలి గానీ!" అన్న ప్రబుధ్ధులు వాళ్ళు.అక్షరబధ్ధంగా ఆంధ్రజ్యోతిలో రాసిన వ్యాసంలో రాసిపారేసారు!అంటే మొత్తం రాష్ట్రానికి తెచ్చుకోవాల్సిన ప్రత్యేకహోదాని సాధించటం వాళ్లకి వాళ్లే కృష్నాజిల్లా వాళ్ళ భుజాల మీద పెట్టేశారు.అలాంటివాటిని సాధించుకురావడం పట్ల తమకి సంబంధం లేదని తేల్చేశారు!

    ఇవన్నీ ప్రజల కోసం న్యాయంగా ఆలోచించేవాళ్ళు మాట్లాడే మాటలేనా?దగుల్బాజీ రాజకీయం!కొత్తగా రాష్త్రం పుట్టి రెండేళ్ళూ కాకుండానే మాకది ఇస్తేనే కలిసి ఉంటాం,లేకపోతే మళ్ళీ రాష్ట్రాన్ని చీలుస్తాం అనటం మానవత్వం ఉన్నవాదు అనగలిగే మాటేనా?!

    P.S:గొప్ప పనుల్ని ఇమిటేట్ చెయ్యదంలో యెంతమాత్రం తప్పు లేదు,మనం కూడా గూపవాళ్ళం కావచ్చు.కానీ వెర్రితనాన్ని ఇమిటేట్ చేసి వెర్రివాళ్ళు కావాలనుకుంటున్నారు.పనిగట్టుకుని నేను వెఋఋఇవాణ్నవుతాను అంతే అవ్నివ్వండి!ఆల్ ది బెస్ట్ చెప్పే పాతకాపులు ఉన్నారుగా?!

    ReplyDelete
    Replies
    1. తెలంగాణావారు వేరుకుంపటికోసం యాగీచేసారు. దాన్ని ఇచ్చినవారు వారి లెక్కలు వారు వేసుకొని ఇవ్వనే ఇచ్చారు. ఈ పరిణామం మంచిదా చెడ్డదా అన్న చర్చ అసంగతం. గతం గతః. మంచిచెడ్దలు కాలమే నిర్ణయిస్తుంది.

      ఐతే తెలంగాణావారు చూపినదోవ ఇది అని నమ్మో మరొకటో కొందరు రాయలసీమనూ చీల్చటం గురించి యోచన చేస్తే ఆశ్చర్యం లేదు. మా మార్గం పట్టారు వీళ్ళని ముద్దుతో కొందరు ఈ వ్యవహారానికి మద్దతు పలకటమూ సమర్థనలు చెప్పటమూ కూడా ఆశ్యర్యపోవలసిన విషయం కాదు.

      కాలప్రభావం వలన బ్లాక్ మెయిల్ అనేది ఉద్యమం అనే ముద్దుపేరును సంతరించుకుంది కాబోలు. ఒకప్పుడు చైనా చాలాబలహీనంగా ఉండేదిట. ఎవరికి వారు విదేశాలవాళ్ళు చైనా భూభాగలమీద పెత్తనం చేయటాన్ని cutting Chinese melon అన్న సామెతగా చెబుతారు. ఇప్పుడు ఆంధ్ర ప్రరిస్థితి అలాగే ఉన్నట్లుంది. కాలప్రభావం!

      ఒకప్పుడు మనదేశంలో సవాలక్షరాజ్యాలుండి అన్నీ తమతమస్వార్థప్రయోజనాల కొఱకు తమలో తాము పోరాడుకుంటూ ఉండటం వలన చివరకు భారతదేశం దీర్ఘకాలం బానిసత్వంలో మగ్గవలసి వచ్చింది. ఐనా మనలో మార్పు రానేలేదు. దేశప్రయోజనాలకన్నా మనదేశంలో ప్రాంతీయప్రయోజనాలే మిన్న అని స్వప్రయోజనాలకోసం రాజకీయపక్షులు యాగీచేయటం దానిని ఇంకా అమాయకత్వం పేరులో అనాలోచితంగా జనబాహుళ్యం గుడ్డిగా అమోదించటం జరుగుతూనే ఉన్నది. ప్రాంతీయవాదం మాత్రమే సంకుచితమని నేను అనటం లేదు అది కులభాషాద్యనేక సంకుచితవాదాలకుజననిగా ఉండే ప్రమాదం ఉంది. ఇలాంటి వాదాలు విస్తృతం ఐతే దేశానికి వినాశకరం. ఏవాదమైనా దేశభవిష్యత్తుకు ప్రమాదకారి యైతే అది మంచిది కాదు కదా. ఆంధ్రామరో సారి రెండు ముక్కలు కావాలని కొందరు కోరుకోవచ్చును. ఈ దేశం మరోసారి బానిసత్వంలోనికి పోవాలనీ కొందరు కుహనామేథావులు కోరుకుంటూ అలాంటి ప్రమాదం ఏమీ లేదని మాత్రం మనవద్ద ముక్తాయిస్తూ ఉండవచ్చును. ఎవరు ఏమిటి అన్నది కాలానికి ముఖ్యం కాదు. ఒక వ్యక్తి యైనా ఒక సంస్థ ఐనా ఒక సమాజం ఐనా ఒక దేశం ఐనా సరే అది తప్పుదారిని వెడుతుంటే తప్పు కాలానికి కాదు - ఆ తప్పుకు శిక్షపడితే కూడా ఆ తప్పు కాలానిది కాదు. తప్పు అన్నది తప్పుదారిని పోవటంలోనే ఉన్నది. శిక్షకూడా ఆ తప్పుదారిలోనే దొరుకుతున్నది. పులి ఎదురయ్యేదాకా పులులున్నట్లు నమ్మం అని బుకాయించేవారి నమ్మకంతో పులికి పనిలేదు సుమా.

      Delete
    2. "ఫలానా మతం/కులం/ప్రాంతం వారు మమ్మల్ని అణిచి వేసారు"

      పై వాక్యం తమిళులు ఉతారాది వారి మీద, ఆంధ్రులు తమిళులు గురించి, సీమ వారు ఆంధ్రుల గురించి. ఇలా ఎందరెందరో ఎందరి గురించో అనడం అనాదిగా పరిపాటి.

      వీటిలో కొన్ని ఉద్యమాలుగా, సదరు వాదనలు న్యాయంగా, చిహ్నాలు తల్లి రూపంగా, నాయకులు కేసరులుగా అనిపిస్తాయి. అలాంటి సమయంలో దేశ ప్రయోజనం వగైరాలు గుర్తు రావు.

      అదే వాదన తసమదీయులు చేసినప్పుడు వేర్పాటువాదంగా, ద్వేషంగా, యాగీగా, స్వార్థ ప్రయోజనంగా, రాజకీయ రొచ్చుగా, బ్లాక్ మెయిల్గా అనిపిస్తాయి. సడన్గా దేశాప్రయోజనాలకు నష్టమని పైగా సమగ్రత కోల్పోతామని భయం వేస్తుంది.

      Only one aspect has changed: the observer's position vis-a-vis the cause. Welcome to identity politics!

      1953 ఆంద్ర రాష్ట్ర ఆవిర్భావం ఒక్కటే న్యాయం పైగా దేశానికి మేలు చేసింది. తత్తిమ్మావన్నీ మోసం దగా దేశద్రోహం!

      తమిళులది మాత్రమె అణిచివేత, ఆంధ్రులు మాత్రమె దేశభక్తులు, శ్రీరాములు మాత్రమె నిజమయిన ఉద్యమకారుడు!

      Delete
    3. @jai
      1953 ఆంద్ర రాష్ట్ర ఆవిర్భావం ఒక్కటే న్యాయం పైగా దేశానికి మేలు చేసింది. తత్తిమ్మావన్నీ మోసం దగా దేశద్రోహం!

      తమిళులది మాత్రమె అణిచివేత, ఆంధ్రులు మాత్రమె దేశభక్తులు, శ్రీరాములు మాత్రమె నిజమయిన ఉద్యమకారుడు!

      Me:యెదటివాడు చెప్పినది అటుముక్కని ఇటు మార్చి ఇటుముక్కని అటు మార్చి మీరు తమిళుల నుంచి విడిపోతే తప్ప్పు లేదు గానీ మేము విడిపోతే తప్పా అని అడగతం తెలివి కాదు.

      అప్పటి ఉద్యమం ప్రజల భాగస్వామ్యంతో జరిగింది.అన్యాయమ న్న దానికి అన్ని ఆధారాలూ చూపించి జబర్దస్తుగా విడిపోయారు!

      మరి మీరు చేసింది యేమిటి?అబధ్ధాలు చెప్పారు!మా ఉద్యఓగాలు లాక్కుపోయారని గిర్గ్లానీ కమిటీ రిపోర్టు చూపించారు,చూశాను గదా!మా నీళ్ళు క్లాక్కున్నారు అన్న్నారు.ఇవ్వాళ మీ ముఖ్యమంత్రే ఒక ప్రాజెక్టుని సగానికి కుదించి పారేసాడు,యెందుకని?

      అప్పటి ఆంధ్రావాళ్ళ ఉద్యమానికి తమీలులు కూడా అసహకరించారు.మరి కనీసం మాత ఆత్రంగా నైనా యే నాయకుదైనా ఆంధ్రప్రాంతానికి వచ్చి ఒక్క మీటింగు పెట్టి ఇదీ మా కోరిక మీరు మాకు సహకరించండి అని అడిగాడా?

      నిజాముని తిడుతూ రాష్త్రమంతా తిరిగిన గద్దర్ సంగతేంటి?తను కూడా ఆంధ్రాలో కాలు పెట్టి అడిగటానికి మొహం చెల్లలేదు,యేంటో పెద్ద సాంకేతిక విషయాలు కత్/పేష్తు చేస్తున్నారు!

      Delete
    4. హరిబాబు గారూ, నేను ఈ టపాలలో ఎక్కడా తెలంగాణా గురించి మాట్లాడలేదు. మీరు (ముల్లా కీ దౌడ్ మసీద్ తక్ అన్నట్టు) లేవనెత్తారు కనుక నేనూ స్పందించాల్సి వస్తుంది.

      గిర్గ్లానీ & కొలువుల విషయం గురించి నాకు తెలీదు. నదీజలాల విషయంలో తెలంగాణాకు జరిగిన అన్యాయం గురించి చర్చించడానికి నేను సిద్దం. మీరు సిద్దమా? తెలియకుండానే అబద్ధాలు అంటూ అభాండం వేయడం భావ్యమా?

      "ఇవ్వాళ మీ ముఖ్యమంత్రే ఒక ప్రాజెక్టుని సగానికి కుదించి పారేసాడు,యెందుకని?"

      చా నిజమా. ఏమిటా ప్రాజెక్టు? ముందెంత? ఇప్పుడెంత? తెలిస్తే చెప్పండి నేనూ విని తరిస్తాను.

      "యే నాయకుదైనా ఆంధ్రప్రాంతానికి వచ్చి ఒక్క మీటింగు పెట్టి ఇదీ మా కోరిక మీరు మాకు సహకరించండి అని అడిగాడా?"

      స్వ. ప్రొఫెసర్ జయశంకర్ పేరు విన్నారా ఎప్పుడయినా?

      ఉమ్మడి మదరాసు రాష్ట్రాన్ని విచ్చిన్నం చేసినప్పుడు మీరూ నేనూ పుట్టలేదు. అయితే ఆ కాలం పత్రికలూ అందుబాటులోనే ఉన్నాయి కుదిరితే చదవండి. ఎన్ని "నిజాలు" చెప్పారో, వేర్పాటువాదులు మాత్రురాష్ట్రంతో ఎంత "సఖ్యత" చూపారో, తమిళుల మీద ఎంత ప్రేమ ఒలికారో మీకే తెలుస్తుంది. వాస్తవం తెలుసుకోవడం మా బంగారం మంచిది అని చంకలు గుద్దుకోవడం అంత సులువు కాదండీ!

      Delete
  5. @jai
    విడిపోయి చాలాకాలమైంది,ఇప్పుడు కాస్తత్నత్ ఉదారంగా ఉందండి.ముఖ్యంగా మీ కోరిక న్యాయమైంది గాబట్టే మీరు విడిపోగలిగారు అనే భ్రమనించి బయత పదండి.నిజానిజాలు మాకూతెలుసు.మోద్ట్లో సాంకేతికపరమైఅన్ ఆంసాలు యెక్కువగా పట్టించుక్నే వాణ్ణి కాదు,కానీ మీ స్పెషల్లైజేషన్ అదే అని తెలిశాక నేనూ శ్రధ్ధ పెట్టాను,అతిగా ఆవేసపడిపోకండి.

    ReplyDelete
  6. జై, వాళ్ళు తెలంగాణా చచ్చినా రాదని జనాన్ని నమ్మించడానికే ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే వాళ్ళ ప్రయత్నం బెడిసికొట్టి తెలంగాణా ఉద్యమమే గెలిచింది. వీళ్ళు ఇంకా కళ్ళు తెరిచినట్టు లేదు. వీళ్ళు రాయలసీమవాదాన్ని మాత్రం ఓడించగలరని నేను అనుకోను.

    ReplyDelete
  7. @jai
    మీరు విడిపోవటానికి యాభయ్యేళ్ళ పైన పట్టింది.అనత్ సుదీర్ఘకాలంలో నిజమగానే పొరపాట్లు,గ్రపాట్లు,నిర్లక్ష్యాలు జరిగినాయన్నా నామ్మఒచ్చు.మీతో అంతకాగినందుకు ఇంగ్లీషువాళ్ళ హయామ్య్లో బాగా నడిచిన పోర్టుల్ని గూడా స్వతంతరం వచ్చాక మొలపడుతున్న్నా పట్టించుకోలేదు,9,10 షెడ్యూళ్ళలో మాకు రావలసిన కంపెనీలు కూడా మీ యెదానే ఉన్నాయి,అవి మీ మొగుదు ఇస్తాడో లేడో తెలీదు,మీరే నిలవలో ఉన్నారు - అయిన అన్యాయం జరిగినది అంటున్నారు,అంటే మొత్తం మూఒడు ప్రాంతాల్లోనూ ఉన్న దాన్నంతా దోచిపెడితే న్యాయం చేసినట్టు ఉండేది అనుకుంటా!

    ఇప్పుడు నిన్నగాక మొన్న విడిపోయిన రెందళ్లలోనే వాళ్ళ వాద్నలౌ గూడా యెందుకు అన్యాయమో నేను విప్పి చెప్పాను అగ్దా,అయినా వాళ్లకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నావంటే అస్లు మాన్వత్వం అనేది యే కోశానా లేదా?

    ప్రేమించు, నీకు నచ్చినదానే ప్రేమించు,హైదరాబాదుని మాత్రమే ప్రేమించు,తెలంగాణని మాత్రమే ప్రేమించు,ముడ్డీ నోటా కీర్తించుకో,ఆంధ్రాని ద్వేషించు,ఆంధ్రా ముక్కలు చెక్కలవ్వాలని కోరుకో,యెవదన్నా అదేమని అంతే అన్ని సాంకేతికపరమైన పులుముళ్ళనేఎ సాకులుగా తెచ్చుకుని సమర్ధించుకునే యెత్తిపోతల పాండిత్యం చూపించు,ఈప్రవీఎణ్ అలాంతివాళ్ళు ఉన్నారుగా పాడినదె పాడ్రా పాచిపళ్ళ దాస్డా అని "వాళ్ళు తెలంగాణా చచ్చినా రాదని జనాన్ని నమ్మించడానికే ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే వాళ్ళ ప్రయత్నం బెడిసికొట్టి తెలంగాణా ఉద్యమమే గెలిచింది" అంటూ యేళ్ల తరబడి పాచికబు=ర్లు చెప్పటానికి,సిగ్గు లేకపోతే సరి!

    ReplyDelete
    Replies
    1. I do not respond to undignified vulgar language, sorry about that :)

      Delete
  8. MP హోదా ఉన్న బాల్క సుమన్ గారు ఒక పత్రికా సంపాదకుడిని 'నీచ్ కమీన్ కుత్తే' అని తిట్టడం చూసినా జై, శ్రీకాంతాచారి వంటి తెలంగాణా మేధావులు స్పందించక పోవటం గమనిస్తే బంగారు తెలంగాణా అనుమానాస్పదం గానే గోచరిస్తోంది.

    ReplyDelete
  9. తెలంగాణా ఎట్టి పరిస్థితులలోనూ రాదు అని జనాన్ని నమ్మించినవాళ్ళలో కొందరు 2014 ఎన్నికల్లో గెలిచి మంత్రి పదవులు కూడా అనుభవిస్తున్నారు. నువ్వు దాసరి పాట అనుకున్నా, జంగం పాట అనుకున్నా, నిజాన్ని అబద్దంగా మార్చలేవు.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని

నిన్నటి 'ఈనాడు'లో తీవ్ర తప్పిదం - నిర్లక్ష్యమా, ఉద్దేశపూర్వకమా?

శుక్రవారం(18.4.14) ఉదయానికి  తెలుగువారికి సంబంధించిన రెండు రాష్ట్రాలలోనూ అతిముఖ్యమైన వార్త అది.  అన్ని దినపత్రికలూ  సహజంగానే ఆ వార్తను  ప్రాధాన్యతాక్రమంలో అత్యంత ముఖ్యమైన స్థానమైన పైవరుసలో(పత్రికా పరిభాషలో దీనిని బ్యానర్ వార్త అంటారు) ఇచ్చాయి. కానీ   తెలుగులో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ దినపత్రిక అయిన 'ఈనాడు'లోమాత్రం భూతద్దం పెట్టి వెతికినా అది కనబడదు. ఆ వివరాలేమిటో చూడండి. తెలుగుదేశానికి, భారతీయజనతాపార్టీకి మధ్య  సీమాంధ్రలో పొత్తుకు సంబంధించి   గురువారంనాడు విభేదాలు పొడసూపటం, ప్రతిష్టంభన నెలకొనటం తెలిసిందే(శుక్రవారం సాయంత్రానికి విభేదాలు సమసిపోయాయి...అది వేరే విషయం). స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే గురువారంసాయంత్రం విజయనగరంలో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, పొత్తువల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువగా కలిగేటట్లుందని చెప్పారు. దీంతో న్యూస్ ఛానల్స్ అన్నింటిలో గురువారం మధ్యాహ్నందగ్గరనుంచీ ఇదే పెద్ద వార్తయి కూర్చుంది. గంటగంటకూ అప్ డేట్స్, ఫోన్ ఇన్స్, చర్చా కార్యక్రమాలు సాగాయి. ఇక శుక్రవారం ఉదయం వచ్చే దినపత్రికలన్నింటిలో ఇదే మొదటి, అతిముఖ్యవార్త అయింది(రెండురాష్ట్ర