Skip to main content

గ్రేట్‌ఆంధ్ర.కామ్‌వారూ! ఇది సబబేనా?

బ్లాగ్ ప్రపంచంలో ఇప్పటికే ఈ కాపీకొట్టడాలు, చెత్తకామెంట్లకు జడిసి చాలామంది మంచి మంచి బ్లాగర్‌లు పోస్ట్‌లు రాయటం ఆపేశారు. ఇటీవల 'కష్టేఫలి' బ్లాగ్ శర్మగారుకూడా అస్త్రసన్యాసం చేయాలనుకున్నప్పటికీ మిగిలిన బ్లాగర్‌ల అభ్యర్ధనలను మన్నించి విరమించుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్లాగు రచయితకుకూడా కష్టేఫలి శర్మగారిలాంటి అనుభవం ఎదురైంది.

ఈనెల 12న ప్రముఖ తెలుగు చిత్రనిర్మాత కె.మురారి చెన్నైలో ప్రెస్‌మీట్ నిర్వహించి దర్శకుడు రాఘవేంద్రరావుకు గీతం యూనివర్సిటీవారు డాక్టరేట్ ఇవ్వటంపై స్పందించారు. రాఘవేంద్రరావువంటి సంస్కారహీనుడికి గౌరవ డాక్టరేట్ ఇవ్వటమేమిటంటూ ధ్వజమెత్తారు. ఈ ప్రెస్‌మీట్‌కు తెలుగు రిపోర్టర్‌లందరూ వెళ్ళినప్పటికీ రాఘవేంద్రరావుఅంటే భయమో, భక్తోగానీ 10టీవీతప్పితే మిగిలిన ఏ తెలుగు దినపత్రికగానీ, ఛానల్‌గానీ ఆ వార్తను ఇవ్వలేదు. 10టీవీవారుమాత్రం సమాచారం అందిన వెంటనే తమ చెన్నై రిపోర్టర్‌ ఫోన్ ఇన్ తీసుకుని దానిని ప్రసారం చేశారు.

యథాలాపంగా టీవీఛానళ్ళన్నిటినీ చూస్తూ 10టీవీలో ఆ వార్తను చూసిన ఈ బ్లాగర్ అదేరోజు మూడుగంటల ప్రాంతంలో దానిపై 'దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు తృటిలో తప్పిన చెప్పుదెబ్బ' అంటూ ఒక పోస్ట్ రాయటం జరిగింది. గ్రేట్ ఆంధ్ర.కామ్‌వారు 13వ తేది ఉదయాన 'రాఘవేంద్రరావుకు చెప్పుదెబ్బలు తప్పాయట' అంటూ ఒక ఆర్టికల్ ఇచ్చారు(ఈ వెబ్‌సైట్‌వారు పోస్ట్ చేసే సమయం పదిగంటలు వెనకకు ఉంటుంది. అందుకనే ఆ ఆర్టికల్‌ను పోస్ట్ చేసిన సమయంచూస్తే 12వతేది రాత్రి పదిగంటలకు పోస్ట్ చేసినట్లుగా ఉంటుంది). ఈ రెండు ఆర్టికల్స్‌నూ గమనిస్తే వారు ఎలా కాపీ కొట్టినదీ అర్ధమవుతుంది. ఈ బ్లాగర్ అంతకుముందు ఈనాడుపై రాసిన ఆర్టికల్‌లోని లైన్‌ను కూడా గ్రేట్‌ఆంధ్రవారు ఇలాగే తీసుకుని కొద్దిగా అటూఇటూ మార్చి తమదైన శైలిలో 'నోరు జార్ చక్రవర్తి' అంటూ  ఇచ్చారు.  

దట్స్ తెలుగు.కామ్‌వారికైతే ఇలాంటి కంటెంట్ చౌర్యం సర్వసాధారణం. ఈ బ్లాగ్‌‌లో గతంలో ఉదయభానుగురించి రాసిన ఒకపోస్ట్‌నుంచి వారు చేసిన చౌర్యాన్ని ఇక్కడ చూడొచ్చు. ఈ బ్లాగ్‌పోస్ట్‌లోని పదాలనుకూడా వారు మక్కికిమక్కి దించేశారు. దాని తాలూకు స్క్రీన్‌షాట్‌నుకూడా ఇక్కడ చూడొచ్చు.




ఎవరైనా ఈ బ్లాగులలో విషయం బాగుందనిపించి మరోచోట వినియోగించదలుచుకుంటే సదరు బ్లాగ్ రచయిత అనుమతి తీసుకోవటం నైతిక సంప్రదాయం. కాబట్టి గ్రేట్ఆంధ్రవారూ! తమరు ఆ నైతిక సంప్రదాయాన్ని పాటిస్తే బాగుంటుందని మనవి.

                                                    
                                                ***


p.s. ఈ బ్లాగ్‌లోని కంటెంట్‌ తీసుకోవాలనుకునాలనుకునేవారు, కంటెంట్ సేవలు అవసరమైనవారు ఈ ఇ-మెయిల్ ఐడీని - tejasswi11@gmail.com సంప్రదించగలరు.


Comments

  1. ఇటీవల 'కష్టేఫలి' శర్మగారుకూడా అస్త్రసన్యాసం చేయాలనుకున్నప్పటికీ మిగిలిన బ్లాగర్‌ల అభ్యర్ధనలను మన్నించి విరమించుకున్న విషయం తెలిసిందే

    నిజమా? ఐతే చాలా సంతోషమే.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయంగారూ! నమస్తే. శర్మగారి పోస్టలు కనబడుతున్నాయికాబట్టి ఆయన అస్త్రసన్యాసం చేయలేదనుకుంటున్నాను.

      Delete
  2. బ్లాగర్లకు ఒక సూచన:
    మీ కాంతెంట్ కాపీ ఐనదని నిర్థారణ అయినప్పుడు తప్పకుండా దానిని గూగుల్‌కు రిపోర్టు చేసి సదరు కాపీ బ్లాగును తొలగించవలసిందిగా కోరవచ్చును, అది మరొక గూగుల్ బ్లాగ్ ఐనప్పుడు.

    ReplyDelete
  3. GaA di elaka burra , burraloa saraku leakumtea ilaanea cheastaaru , bhaava daridram

    ReplyDelete
  4. మీ అభిప్రాయాలు మీ బ్లాగుకే పరిమితం కాకుండా మరో పది మందికి చేరుతున్నందకు గర్వించాలి కాని, ఇలా బాద పడితే ఎలా సార్? మీరి బాగా వ్రాస్తారని ఆ కాపీ కొట్టినోడికి తెలుసు కదా!

    పదిమందికి చేరడానికి కాకుండా, మీరు అమ్ముకొవడానికి అయితే ఇక్కడ ప్రచురించడం దేనికి? అంత అమూల్యమైన మీకు సంబందించిన అభిప్రాయం అయితే కంటెంట్ కాపీ రైటు చేయించుకోండి.

    ReplyDelete
    Replies
    1. ఎక్స్‌వైజడ్‌గారూ! మీ ఇంట్లోనుంచి ఏదైనా డబ్బో, వస్తువో దొంగతనం జరిగితే - అది నాదగ్గర ఉంది కాబట్టేకదా దొంగలు దానిని దొంగిలించారు, ఎవరో ఒకరు అనుభవిస్తున్నారులే అని మీలాంటి మహానుభావులు గర్వించి ఆనందిస్తారేమోగానీ సగటుజీవులందరికీ అది సాధ్యంకాదండి.

      బ్లాగులలో జరుగుతున్న కంటెంట్ చౌర్యంపై ఇంత మంచి విలువైన సూచన చేశారంటే మీరు గ్రేటో, దట్సో అయిఉంటారు.

      Delete
  5. చాలా తప్పుగా పోల్చారు.

    నేను కష్టపడి సంపాదించిన సొమ్ము ఎవరైనా దొంగిలిస్తే, పొలీస్ కంప్లైట్ ఇస్తాను. మన వ్యవస్థలో మన చట్టాలు కల్పించిన హక్కు అది.

    ఎవడో గొట్టంగాడు ఇంకో గొట్టంగాడిని విమర్శీస్తే, ఆ విషయాన్ని నా బ్లాగులో నా గులకొద్ది వ్రాసుకొవడమే పెద్ద టైం వేస్ట్ అని భావిస్తాను. వాటిని ఎవడైనా కాపీ కొడితే, నాలా ఇంకోకడు టైం వేస్ట్ చేసుకోనందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతా.

    పొరబాటున నేను వ్రాసుకున్న నా సొంత సూక్తులు కాపీ కొడితే, ఇంకా ఆనందపడతా. ఎంతో గౌరవంగా ఫీల్ అవుతా.

    ఫుడ్ కోసం కష్టపడి సంపాదించేది, సరదాగా రిలీఫ్ కోసం వ్రాసుకునే బ్లాగులో కంటెంట్ తొ పోలిక ఏమిటి సార్?

    నాలా అలోచించమని చెప్పడానికి కామెంట్ చెయ్యడం లేదు. ఎదో రెస్పాండ్ అవుతున్నాను.. అంతే. Take it Easy. మీ పొరాటానికి నేను అడ్డు కాదు సుమా!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని

30వ రాష్ట్రంగా రాయలసీమ! రాజుకుంటున్న 'ప్రత్యేక' ఉద్యమం

అసమానతలనుంచి అసంతృప్తి పుట్టుకొస్తుంది. అసంతృప్తినుంచి ఆక్రోశం పెల్లుబుకుతుంది. రాయలసీమ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అసంతృప్తితో సీమవాసులు రగిలిపోతున్నారు. ఏళ్ళ తరబడి వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. Read Full Story Here.

నిన్నటి 'ఈనాడు'లో తీవ్ర తప్పిదం - నిర్లక్ష్యమా, ఉద్దేశపూర్వకమా?

శుక్రవారం(18.4.14) ఉదయానికి  తెలుగువారికి సంబంధించిన రెండు రాష్ట్రాలలోనూ అతిముఖ్యమైన వార్త అది.  అన్ని దినపత్రికలూ  సహజంగానే ఆ వార్తను  ప్రాధాన్యతాక్రమంలో అత్యంత ముఖ్యమైన స్థానమైన పైవరుసలో(పత్రికా పరిభాషలో దీనిని బ్యానర్ వార్త అంటారు) ఇచ్చాయి. కానీ   తెలుగులో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ దినపత్రిక అయిన 'ఈనాడు'లోమాత్రం భూతద్దం పెట్టి వెతికినా అది కనబడదు. ఆ వివరాలేమిటో చూడండి. తెలుగుదేశానికి, భారతీయజనతాపార్టీకి మధ్య  సీమాంధ్రలో పొత్తుకు సంబంధించి   గురువారంనాడు విభేదాలు పొడసూపటం, ప్రతిష్టంభన నెలకొనటం తెలిసిందే(శుక్రవారం సాయంత్రానికి విభేదాలు సమసిపోయాయి...అది వేరే విషయం). స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే గురువారంసాయంత్రం విజయనగరంలో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, పొత్తువల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువగా కలిగేటట్లుందని చెప్పారు. దీంతో న్యూస్ ఛానల్స్ అన్నింటిలో గురువారం మధ్యాహ్నందగ్గరనుంచీ ఇదే పెద్ద వార్తయి కూర్చుంది. గంటగంటకూ అప్ డేట్స్, ఫోన్ ఇన్స్, చర్చా కార్యక్రమాలు సాగాయి. ఇక శుక్రవారం ఉదయం వచ్చే దినపత్రికలన్నింటిలో ఇదే మొదటి, అతిముఖ్యవార్త అయింది(రెండురాష్ట్ర