టీజర్ విడుదలదగ్గరనుంచి గబ్బర్ సింగ్ తో పోల్చబడుతున్న 'ఆగడు' చిత్రం, నిన్న విడుదలతర్వాతచూస్తే ఆ వాదనను నిజంచేసేటట్లుగా ఉంది. చిత్ర రచయితలు, దర్శకుడు శ్రీనువైట్లపై గబ్బర్ సింగ్ ప్రభావం స్పష్టంగా...ముఖ్యంగా మూలకథలో, ఫస్ట్ హాఫ్ లో, సన్నివేశాలలో కొట్టొచ్చినట్లు కనబడుతుంది. మరోవైపు శ్రీనువైట్ల-మహేష్ కాంబినేషన్లో వచ్చిన దూకుడు ప్రభావం మరోవైపు. వెరసి ఇది దూకుడుసింగ్ అయింది. ఈ పరమ రొటీన్, ఫార్ములా కథకు కథనంలో కొత్తదనం ఏమీ లేకపోవటం పెద్ద మైనస్. ఎప్పుడూ ఎవరో ఒకరితో గొడవపెట్టుకునే దర్శకుడు శ్రీనువైట్ల ఈ సారి కోనవెంకట్, గోపిమోహన్ లతో గొడవపెట్టుకుని 'ఆగడు'కు అనిల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, ప్రవీణ్ వర్మ అనే కొత్త రచయితలను పెట్టుకున్నారు. వీరి డైలాగులు బాగానే ఉన్నప్పటికీ అవి సంక్లిష్టంగా, హైరేంజ్ లో ఉండటం ప్రధానంగా మైనస్ పాయింట్. మహేష్ విలన్స్ ను ట్రాప్ చేయటానికి తన పాత హిట్ సినిమాల కథలను చెప్పే కాన్సెప్ట్ సులభంగా అర్ధంకావటంలేదు. మీలో ఎవరు పోటుగాడు ఎపిసోడ్ లోని కాన్సెప్ట్ కూడా అలాగే ఉంది. డైలాగులు, అరుపులు, పంచ్ లు సినిమాలో బాగా ఎక్కువైపోయాయి. మహేష్ డైలాగులు కొన్నిచోట్ల అర్ధంకాన...
ఆనోభద్రా క్రతవోయంతు విశ్వత: Let noble thoughts come from all sides