చింత చచ్చినా పులుపు చావనట్లు...ఆర్ధిక వ్యవస్థ కుదేలైపోయి అగ్రరాజ్య హోదా పోగొట్టుకునే దశలో ఉన్నా, అమెరికా ఇంకా దురహంకార వైఖరిని విడనాడడంలేదు. ఇంకా తమకొకన్యాయమూ, ఎదుటివారికొక న్యాయమన్నట్లుగానే వ్యవహరిస్తోంది. మెక్సికో గల్ఫ్ లో చమురు లీకేజికిగానూ BP ఆయిల్ కంపెనీనుంచి చెవులు మెలిపెట్టి మరీ నష్టపరిహారం కట్టించిన అంకుల్ శామ్...భోపాల్ గ్యాస్ బాధితులకు నష్టపరిహారం విషయంలో మాత్రం సెలెక్టివ్ అమ్నీషియా(మతిమరుపు)ను తెచ్చిపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల భారత పర్యటనలో మనదేశాన్ని, సమకాలీన పరిస్థితులలో ప్రపంచంలో మనదేశ ప్రాధాన్యతను ఆకాశానికెత్తేస్తూ మాట్లాడి, అమెరికాఉత్పత్తుల అమ్మకాలకోసం వేలకోట్లరూపాయల వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుని వెళ్ళిన ఒబామాకు, ట్రైవ్యాలీ యూనివర్సిటీ చేతిలో మోసపోయిన భారతీయ విద్యార్ధుల విషయంలో మానవతాదృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం లేదా? ఆ భారతీయ విద్యార్ధులంతా అమెరికాలో ట్విన్ టవర్స్ కూల్చివేత వంటి విధ్వంసరచనకు వెళ్ళిన ఉగ్రవాదులో, లేకపోతే మెక్సికోతీరంనుంచి పోలీసుల కళ్ళుగప్పి అక్రమంగా చొరబడే వలసదారులో కాదుకదా. అలా వెళ్ళిన సంఘ వ్యతిరేకశక్తులను పట్టుకోలేని చేతకాని ప్రభుత్వం ఈ పె...
ఆనోభద్రా క్రతవోయంతు విశ్వత: Let noble thoughts come from all sides