Skip to main content

పోలీసుల అదుపులో మల్లిక్ పరుచూరి: గూగుల్ సైంటిస్ట్ చేసిన తప్పులు ఇవే!

 


గూగుల్ సైంటిస్ట్ మల్లిక్ పరుచూరిని హైదరాబాద్ పోలీసులు ఇంటరాగేట్ చేస్తున్నారుథర్డ్ వేవ్ లో ఇంటికో శవం లేస్తుందనే వ్యాఖ్యలతో ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారనే అభియోగంపై ఆయనను సుల్తాన్ బజార్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారుఆయనకు మద్దతుగా వీరమాచనేని రామకృష్ణమరికొందరు మద్దతుదారులు పోలీస్ స్టేషన్ కు వచ్చి సంఘీభావం ప్రకటించారుఇప్పుడంటే సెకండ్ వేవ్ ఉపశమించటంతో కాస్త తగ్గిందిగానీఆమధ్యఒక నెలరోజుల క్రితం ఈ మల్లిక్ పరుచూరి గురించి రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద చర్చ జరిగిందిఇతనికి మద్దతుగావ్యతిరేకంగా సోషల్ మీడియాలోబయట తెలుగు ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి తీవ్రంగా వాదోపవాదాలు చేసుకున్నారు.

మల్లిక్ పరుచూరి తనను తాను ఒక లూయీస్ పాశ్చర్‌(వైద్యరంగంలో అపూర్వమైన ఆవిష్కరణలు చేసి మానవాళికి మహోపకారం చేసిన ఒక జీనియస్ సైంటిస్ట్) లాగా ఊహించేసుకుని కోవిడ్ వ్యాధికి తనదైన శైలిలో మందులు ప్రిస్క్రైబ్ చేసి వార్తలలోకెక్కిన సంగతి తెలిసిందే. అలా మందులు సూచించటమేకాకుండాసాంప్రదాయక(conventional) వైద్య విధానంలో కోవిడ్‌ చికిత్సకు అనుసరిస్తున్న ప్రతి పద్ధతినీ మల్లిక్ ఎద్దేవా చేస్తూ అల్లోపతి వైద్యులపై దుమ్మెత్తిపోశారు. అంతవరకు అయితే ఫర్వాలేదుకానీ ఆయన ఈక్రమంలోశిక్షార్హమైన కొన్ని తప్పిదాలు చేశారు. పూర్తి వ్యాసం చదవటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Comments

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని...

ఏపీ ఎన్నికలు: బలంగా ప్రభావం చూపనున్న నెగెటివ్ ఓటు!

  ఐదేళ్ళు ఒక పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత ఉండటం సహజం(ఇటీవలికాలంలో ఒడిషా, అప్పట్లో ప.బెంగాల్ వంటి కొన్ని అరుదైన సందర్భాలు తప్ప). అయితే వైసీపీ పాలనలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఏపీలో ధారాళంగా అందుతున్న సంక్షేమ పథకాల పుణ్యమా అని వైసీపీకి సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, మరోవైపు వ్యతిరేకులు కూడా పెద్ద సంఖ్యలోనే తయారయ్యారు. పోలింగ్ రోజున - జగన్ సానుభూతి పరుల సంకల్పం గట్టిగా ఉంటుందా, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ గెలవకూడదు అనే వర్గాల సంకల్పం గట్టిగా ఉంటుందా అనేదానిని బట్టి ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుంది... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి -   లింక్ .  

కమ్మవారిని దెబ్బతీయటానికే రాజధానిని జగన్ మార్చారా?

కమ్మవారిని దెబ్బతీయటానికే జగన్మోహన్‌రెడ్డి రాజధానిని అమరావతినుంచి తరలిస్తున్నారని పలువురు టీడీపీ నాయకులు రాష్ట్రప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే  అంశంపై   మంత్రి   కొడాలినాని నిన్న అసెంబ్లీలో   ఒక   అనూహ్యమైన  కోణాన్ని ఎత్తిచూపారు . దీనితో ఈ మొత్తం వ్యవహారం ఒక కొత్త మలుపు తిరిగింది. మూడురాజధానులకుమద్దతుగా   మంత్రి   కొడాలినాని  అసెంబ్లీలో  చేసిన   ప్రసంగం   ఆద్యంతం   ఆసక్తికరంగా   సాగింది .  మాజీముఖ్యమంత్రి   చంద్రబాబు   నాయుడు ,  టీడీపీలోని   తమ   సామాజికవర్గం   నాయకులు ,  ఆ  పార్టీకి   సంపూర్ణ   సహకారాలు   అందిస్తున్న   పత్రికాధిపతులు   రామోజీరావు ,  రాధాకృష్ణ , టీవీ5  నాయుడులపై తనదైనశైలిలో   నాని   చెణుకులు  విసిరారు.    పంచారామాలలో  ఒకటైన పుణ్యక్షేత్రం,  అంతర్జాతీయంగా  ఖ్యాతిగాంచిన  బౌధ్ధ   స్థూపం  ఉ న్న   పవిత్రస్థలం ,  శాతవాహనులకు ...