గత ఫిబ్రవరిలో విడుదలైన 'రెడ్‌మి నోట్ 7 ప్రో' భారత మొబైల్ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. బడ్జెట్ మొబైల్స్ సెగ్మెంట్‌లో ఆ ఫోన్ ను దాదాపుగా 'గేమ్ ఛేంజర్' అని చెప్పొచ్చు. 14 వేల రూపాయలకే స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ సోనీ కెమేరా వంటి అద్భుతమైన స్పెసిఫికేషన్స్ ఇస్తున్న ఈ ఫోన్ ను మార్కెట్ నిపుణులు బెస్ట్ 'వేల్యూ ఫర్ మనీ' గ్యాడ్జెట్ గా అభివర్ణించారు. ఒక్క ఎన్ఎఫ్‌సి(నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్) తప్పితే మిడ్‌రేంజ్, ప్రీమియమ్ సెగ్మెంట్ ఫోన్లలో ఉండే ఫీచర్లు దాదాపుగా అన్నీ ఉన్నాయనే చెప్పాలి. ఇప్పటికే భారత్‌లో మొబైల్ ఫోన్ అమ్మకాలలో నంబర్ 1 స్థానానికి చేరుకున్న షియామి(రెడ్‌మి సంస్థకు మాతృసంస్థ)ని రెడ్‌మి నోట్ 7 ప్రో మరింత పైకి తీసుకెళుతుందని అందరూ భావించారు. అయితే షియామికి వణుకు పుట్టించే విధంగా, 'రెడ్‌మి నోట్ 7 ప్రో'ను తలదన్నే ఫోన్‌ను రియల్ మి సంస్థ మూడురోజుల క్రితం విడుదల చేసింది. పూర్తి వ్యాసం చదవటానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఐదేళ్ళు ఒక పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత ఉండటం సహజం(ఇటీవలికాలంలో ఒడిషా, అప్పట్లో ప.బెంగాల్ వంటి కొన్ని అరుదైన సందర్భాలు తప్ప). అయితే వైసీపీ పాలనలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఏపీలో ధారాళంగా అందుతున్న సంక్షేమ పథకాల పుణ్యమా అని వైసీపీకి సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, మరోవైపు వ్యతిరేకులు కూడా పెద్ద సంఖ్యలోనే తయారయ్యారు. పోలింగ్ రోజున - జగన్ సానుభూతి పరుల సంకల్పం గట్టిగా ఉంటుందా, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ గెలవకూడదు అనే వర్గాల సంకల్పం గట్టిగా ఉంటుందా అనేదానిని బట్టి ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుంది... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి - లింక్ .
Comments
Post a Comment