ఈ ఎన్నికల్లో విజయానికి కేసీఆర్ మొట్టమొదట కృతజ్ఞతలు చెప్పాల్సింది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు. ఎందుకంటే, ఆఖరినిమిషంలో చంద్రబాబునాయుడు హైదరాబాద్, ఖమ్మం తదితర ప్రాంతాలలో చేసిన ప్రచారం టీఆర్ఎస్ కు అనూహ్యరీతిలో కలిసొచ్చింది. చంద్ర బాబు పర్యటనల తర్వాత తెలంగాణలో మూడ్ ఒక్కసారిగా మారిపోయి టీఆర్ఎస్ కు అనుకూలంగా ఓట్ల పోలరైజేషన్ జరిగింది.Click here to Read the Full Story.
నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని...
అవును ఇది కఠోర వాస్తవమే. ఈ వ్యాసంలో వ్రాసిన ప్రతి అక్షరం సత్యమే. ఒప్పుకున్నా ఒప్ప్పుకోక పోయినా అత్యాశకు పోయి చంద్రబాబు దగ్గరుండి తెరాసకు భారీ మెజారిటీ ని కల్పించడంలో చక్కగా సహకరించారు. పిచ్చి కాంగ్రెస్ వాళ్ళు అదనంగా తప్పక వచ్చి చేరుతుందనుకున్న ఓట్ల శాతానికి + ఆర్ధిక అవసరాలకు కక్కుర్తి పడి బొక్క బోర్లా పడ్డారు. వాళ్లంతా వాళ్ళుగా పోటీ చేసి ఉండుంటే తప్పకుండా ఇప్పటికన్నా చాలా, చాలా మెరుగైన ఫలితాలు రాబట్టుకుని ఉండేవారు. పాపం అతిగా ఆశ పడ్డారు.
ReplyDeleteకాంగ్రెస్ వాళ్ళూ ఇది గమనించండి - రేప్రొద్దున మీరు గనుక చంద్రబాబుతో ఆంధ్రాలో జత కడితే ఇకపై మీ జీవిత కాల పరిస్థితి ఇప్పటి మీ తమిళనాడు పరిస్థితే. తోక పార్టీగా మిగిలిపోతారు. మిమ్మల్ని జత కలుపుకుని చంద్రబాబు తానూ అందలమెక్కుతాడు తప్ప మీకు అధికారం అప్పచెప్పడు. అలాంటప్పుడు మీకు ఆయనతో చేరితే వచ్చే లాభమేంటి? మీ ఓట్ల శాతాన్ని కలుపుకుని అధికారపు నిచ్చెన ఎక్కుదామనే ఆయన దురాశ తెలుసుకోండి. మీరు ఆయనతో జేరడంతో మీరు ఆయనకు నిచ్చెనవ్వడం తప్ప గత్యంతరం లేదు. పార్లమెంట్ లెక్కలకొస్తే మీరు ఆయనతో జత కట్టకున్నా ఆయన చచ్చినట్లు మీకు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితే. లెక్కలేసుకోండి. మీ గొయ్యి మీరే తీసుకోకండి. తస్మాత్ జాగ్రత్త.
Thank you Anonymous garu!
Deleteఅనుకున్నంతా అయింది. తెలంగాణాలో కాంగ్రెస్కి మద్దతిచ్చి గద్దెక్కించేసి ఆంధ్రాలో కాంగ్రెస్ సాయంతో గెద్దెక్కేయాలన్న TDP చాణక్యుం బోల్తాపడింది. ఇప్పుడు తెలంగాణాలో కాంగ్రెస్కొచ్చిన సీట్లు TDP కి, TDP కొచ్చిన సీట్లు కాంగ్రెస్కి రావడం తప్పదని ప్రజలమాట. TDP కాంగ్రెస్ ల అపవిత్రపొత్తును ప్రజలు ఛీకొట్టేరు.
ReplyDelete