పొద్దున్నే లేస్తే మనం తినే ఇడ్లీ , దోశ , పూరి , బ్రెడ్ లతో మొదలుపెట్టి భోజనంలో తినే అన్నం , చపాతి , ఇక సాయంత్రంపూట స్నాక్స్ గా తినే సమోసాలు , బజ్జీలు , బర్గర్ , పిజ్జాలవరకు అన్నింటిలో ఎక్కువగా ఉండే ఏకైక పదార్థం ఏమిటో తెలుసా ? కార్బోహాడ్రేట్స్ ( పిండిపదార్థాలు ). ఇది మనం తీసుకునే ఆహారంలో 70 నుంచి 80 శాతం ఉంటోంది . ఇదే మన కొంప ముంచుతోందని , షుగర్ , బీపీ , ఒబేసిటీ , క్యాన్సర్ వంటి జీవనశైలి వ్యాధులకు కారణమవుతోందని తాజా అధ్యయనాలలో తేలింది . దీనితోపాటు - సంప్రదాయ వంటనూనెలు , నెయ్యి , వెన్న వంటి ఫ్యాట్స్ ( కొవ్వు పదార్థాలు ) తో కొలెస్టరాల్ పెరుగుతుందని ఇంతవరకూ నమ్ముతూ వస్తున్న సిద్ధాంతం కూడా పూర్తిగా తప్పని తెలియవచ్చింది . ఫ్యాట్స్ తినటం వలన శరీరంలో కొవ్వు పేరుకుపోతుందన్నది అపోహమాత్రమేనని , వాటిని నిరభ్యంతరంగా తీసుకోవచ్చని అంటున్నారు . ఈ తాజా అధ్యయనాలను ఆధారంగా చేసుకుని రూపొందించిన ఒక కొత్త ప్రత్యామ్నాయ ఆహార విధానం ( డైట్ ఛేంజ్ ప్రోగ్రామ్ ) ఇప్పుడు ఏపీలోని విశాఖపట్నం , విజయవాడ ప్రాంతాలలో హల్ చల్ చేస్తోంది . దీనిని ఆచరించటంవలనసాధారణ వ్యక్తులకు ఆరోగ్యం ఎన్నోరెట్లు మెరుగవుతుండగా , షుగర్ , బీ...
ఆనోభద్రా క్రతవోయంతు విశ్వత: Let noble thoughts come from all sides