అధికారం పరమావధికాదు , ప్రజాసమస్యలపై ప్రశ్నించటం కోసం అంటూ రాజకీయాలలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ పట్ల యువత గణనీయసంఖ్యలోనే ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే . నవరాజకీయం రావాలని , నిష్కళంకమైన పాలన కావాలని కాంక్షిస్తున్న యువతీయువకులకు పవన్ జనసేన ఆశాకిరణంలాగా కనపడటమే దీనికి కారణం . అట్టడుగు స్థాయినుంచి అత్యున్నతస్థాయి ఉద్యోగాలలో ఉన్నవారిదాకా , ఇంకా చెప్పాలంటే విదేశాలలోఉన్నవారు కూడా చాలామంది పవన్ వెంట నడవటానికి ఉవ్విళ్ళూరుతున్నారు . మరోవైపు , పవన్ గానీ , ఆయన బృందంగానీ ఏమీ చెప్పకపోయినా తమ తమ ప్రాంతాలలో స్వచ్ఛందంగా , తపనతో అనేక సేవాకార్యక్రమాలను , వితరణ కార్యక్రమాలను నిర్వ హించేవారి సంఖ్యకూడా తక్కువేమీకాదు . ఈ జనసైనికులు పవన్ ను ఎవరైనా పరుషంగా ఒక్కమాట అంటే చాలు తమకు అందుబాటులోఉన్న సోషల్ మీడియాద్వారా , ఇతర మార్గాలద్వారా వాళ్ళమీద యుద్ధాలు ప్రకటిస్తున్నారు . ఒక్కముక్కలో చెప్పాలంటే వీరంతా ఆయనపై గంపెడాశలు పెట్టుకున్నారు . అయితే , మరో ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్నప్పటికీ ఇంతవరకూ పార్టీ నిర్మాణమే జరగని , ద్వితీయశ్రేణి నాయకత్వమే లేని , స్పష్టమైన కార్యాచరణ కనబడని , తమ స్వరం వినిపించటానికి సొంత మీడియా ...