తెలుగు సినిమాల్లో, ఆ మాటకొస్తే మనదేశంలో రూపొందే ఏ కమర్షియల్ సినిమాలోనైనా క్లైమాక్స్ సీనులో - బాధితులను ఆదుకోవటానికి, విలన్ బ్యాచిని చితకబాదటానికి హీరోగారు ఆఖరినిమిషంలో బయలుదేరటం సర్వసాధారణం. అలా బయలుదేరటానికి సదరు హీరోగారు వాడే వాహనాలు రెండే రెండు. గుర్రం లేదా 'బుల్లెట్' మోటార్ సైకిల్. ఆయన వాటిల్లో ఏదో ఒకదానిని తీసుకుని బయలుదేరగానే ఫ్రంట్ బెంచర్స్ ఉత్సాహానికి అంతు ఉండదు. హాలంతా ఈలలతో దద్దరిల్లిపోవాల్సిందే. అలా 'బుల్లెట్' మోటార్ సైకిల్ కు సినిమాఫీల్డ్ తో అవినాభావ సంబంధముంది.To Read full story, Click Here
ఐదేళ్ళు ఒక పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత ఉండటం సహజం(ఇటీవలికాలంలో ఒడిషా, అప్పట్లో ప.బెంగాల్ వంటి కొన్ని అరుదైన సందర్భాలు తప్ప). అయితే వైసీపీ పాలనలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఏపీలో ధారాళంగా అందుతున్న సంక్షేమ పథకాల పుణ్యమా అని వైసీపీకి సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, మరోవైపు వ్యతిరేకులు కూడా పెద్ద సంఖ్యలోనే తయారయ్యారు. పోలింగ్ రోజున - జగన్ సానుభూతి పరుల సంకల్పం గట్టిగా ఉంటుందా, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ గెలవకూడదు అనే వర్గాల సంకల్పం గట్టిగా ఉంటుందా అనేదానిని బట్టి ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుంది... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి - లింక్ .
Comments
Post a Comment