Skip to main content

రెడ్‌మి, లెనోవా ఫోన్‌లు అంతచౌకగా ఎలా అమ్ముతున్నారో తెలుసా!


రెడ్‌మి(షియామి), లెనోవా, జియానీ, లీకో, హ్వావేయ్(హువావే అని కూడా పిలుస్తారు), కూల్‌ప్యాడ్ వంటి చైనా కంపెనీల మొబైల్ ఫోన్‌ల మోడల్స్ భారత్‌లో అత్యధిక సంఖ్యలో అమ్ముడుపోతున్న సంగతి తెలిసిందే. మంచి కాన్ఫిగరేషన్, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఉన్న పవర్‌ఫుల్ ఫోన్లను శాంసంగ్, సోనీ, ఎల్‌జీ, హెచ్‌టీసీ వంటి బడా కంపెనీల ఫోన్ల ధరలలో మూడోవంతుకే అందిస్తుండటంతోనే పైన పేర్కొన్న చైనా కంపెనీల ఫోన్‌లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ముఖ్యంగా రెడ్‌మి సంస్థ ఫోన్‌లు భారతీయుల హృదయాలను కొల్లగొట్టి వారి జేబుల్లో తిష్ఠవేసుకుని కూర్చున్నాయి. రెడ్‌మి నోట్ 3, రెడ్‌మి 3ఎస్, రెడ్‌మి 3 ప్రైమ్ మోడల్స్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మొబైల్ ఫోన్లుగా ఇటీవల రికార్డులకెక్కాయి. ఈ మోడల్స్‌లోని స్పెసిఫికేషన్స్‌తోనే శాంసంగ్, సోనీ, ఎల్‌జీ కంపెనీల ఫోన్లను కొనాలంటే మూడింతలు ఎక్కువ డబ్బు పెట్టాల్సిఉంటుంది(రెడ్‌మి రెండేళ్ళ క్రితం తయారుచేసిన మోడల్స్‌లో స్నాప్ డ్రాగన్ 400, స్నాప్ డ్రాగన్ 410 ప్రాసెసర్‌ను వాడగా, అదే ప్రాసెసర్‌లతో తయారుచేసిన మోడల్స్‌ను శాంసంగ్ ప్రస్తుతం 15-20 వేల రేంజిలో అమ్ముతోంది). మరి ఈ చైనా కంపెనీలు ఇంత కారుచౌకగా ఎలా అమ్ముతున్నాయన్నదే ఆసక్తికరమైన అంశం. పూర్తి కథనం చదవటానికి  ఇక్కడ క్లిక్ చేయండి. 

Comments

Popular posts from this blog

ఏపీ ఎన్నికలు: బలంగా ప్రభావం చూపనున్న నెగెటివ్ ఓటు!

  ఐదేళ్ళు ఒక పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత ఉండటం సహజం(ఇటీవలికాలంలో ఒడిషా, అప్పట్లో ప.బెంగాల్ వంటి కొన్ని అరుదైన సందర్భాలు తప్ప). అయితే వైసీపీ పాలనలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఏపీలో ధారాళంగా అందుతున్న సంక్షేమ పథకాల పుణ్యమా అని వైసీపీకి సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, మరోవైపు వ్యతిరేకులు కూడా పెద్ద సంఖ్యలోనే తయారయ్యారు. పోలింగ్ రోజున - జగన్ సానుభూతి పరుల సంకల్పం గట్టిగా ఉంటుందా, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ గెలవకూడదు అనే వర్గాల సంకల్పం గట్టిగా ఉంటుందా అనేదానిని బట్టి ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుంది... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి -   లింక్ .  

కమ్మవారిని దెబ్బతీయటానికే రాజధానిని జగన్ మార్చారా?

కమ్మవారిని దెబ్బతీయటానికే జగన్మోహన్‌రెడ్డి రాజధానిని అమరావతినుంచి తరలిస్తున్నారని పలువురు టీడీపీ నాయకులు రాష్ట్రప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే  అంశంపై   మంత్రి   కొడాలినాని నిన్న అసెంబ్లీలో   ఒక   అనూహ్యమైన  కోణాన్ని ఎత్తిచూపారు . దీనితో ఈ మొత్తం వ్యవహారం ఒక కొత్త మలుపు తిరిగింది. మూడురాజధానులకుమద్దతుగా   మంత్రి   కొడాలినాని  అసెంబ్లీలో  చేసిన   ప్రసంగం   ఆద్యంతం   ఆసక్తికరంగా   సాగింది .  మాజీముఖ్యమంత్రి   చంద్రబాబు   నాయుడు ,  టీడీపీలోని   తమ   సామాజికవర్గం   నాయకులు ,  ఆ  పార్టీకి   సంపూర్ణ   సహకారాలు   అందిస్తున్న   పత్రికాధిపతులు   రామోజీరావు ,  రాధాకృష్ణ , టీవీ5  నాయుడులపై తనదైనశైలిలో   నాని   చెణుకులు  విసిరారు.    పంచారామాలలో  ఒకటైన పుణ్యక్షేత్రం,  అంతర్జాతీయంగా  ఖ్యాతిగాంచిన  బౌధ్ధ   స్థూపం  ఉ న్న   పవిత్రస్థలం ,  శాతవాహనులకు ...

ఏపీలో ఏ వర్గం ఓట్లు ఎటువైపు? తటస్థ ఓటర్ల మద్దతు జగన్‌కా, కూటమికా?

  ఏపీలో సంఖ్యాపరంగా అతి పెద్ద వర్గం బీసీలు. వివిధ రాజకీయపార్టీలు బీసీ మంత్రాన్ని జపిస్తుంటాయిగానీ, రెడ్లు, కమ్మలు, కాపులు, ఎస్‌సీ మాలలవంటి కులాలలాగా బీసీలు గంపగుత్తగా ఒకవైపు ఓట్లు వేయటం జరగదు. ఎందుకంటే బీసీలు అంటే యాదవ, గౌడ, శెట్టిబలిజ, పద్మశాలి, మత్స్యకార వంటి అనేక వెనుకబడిన కులాల సమాహారం. రెడ్లు, కమ్మలు, కాపులు, ఎస్‌సీలలాగా బీసీలను ఒక్కటిగా కనెక్ట్ చేసే యూనిఫికేషన్ ఫ్యాక్టర్ ఏదీ ఉండదు. అయితే ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. బీసీలపై ప్రేమ వలనో, వారి ఓట్లపై ప్రేమవలనోగానీ, జగన్మోహన్ రెడ్డి వారికి ఈ ఎన్నికల్లో వారికి పెద్దపీట వేశాడు. కొన్నిచోట్ల తన కులాభిమానాన్ని కూడా పక్కనపెట్టి రెడ్లుకు కాకుండా బీసీలకు టిక్కెట్లు ఇచ్చాడు... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి -   లింక్ .