Skip to main content

సెల్ఫ్ గోల్ చేసుకున్న చంద్రబాబు


తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి "నానాటికి తీసికట్టు…" సామెత చందంగా ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికలలో 15మంది ఎమ్మెల్యేలు ఉన్న తెలుగుదేశం బలం ప్రస్తుతం తొమ్మిదికి దిగజారింది. ఆ ఎన్నికలలో టీడీపీ టిక్కెట్‌పై గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్, తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కృష్ణారెడ్డి, మాధవరం కృష్ణారావు, వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాత్రమే కాకుండా రాజ్యసభ ఎంపీ గుండు సుధారాణి కూడా ఇప్పటికే టీఆర్ఎస్‌లోకి జంప్ అయ్యారు. తాజాగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకూడా... To Read Full Story, Click Here.

Comments

  1. ప్రస్తుత రాజకీయాల్లో మొసలి లాంటివాడు చంద్రబాబు . అతడ్ని తక్కువ అంచనా చేయడం బుడ్డి తక్కువపని .అతని తర్వాత ఈ రాజకీయాలు ప్రక్షాళన అవ్వొచ్చు

    ReplyDelete
  2. Really Anonymous? Is CBN dangerous? Everybody should hide from him?.

    ReplyDelete
  3. హాయ్ ఫ్రెండ్స్
    ఇక్కడ నేను తెలుగు లో వున్నా సాఫ్ట్వేర్ ట్రైనింగ్ వీడియోస్ collect చేశాను.
    ఇవి webdesign కోర్స్ చేయాలి అనుకునీ వాళ్ళకు చాల యూస్ అవుతాయి.
    ఇక్కడ YouTube లింక్ అండ్ కోర్స్ నేమ్ ఇస్తున్నాను.
    ఇవి సాఫ్ట్వేర్ కోర్సెస్ చేసి వాళ్ళకు కూడా యూస్ అవుతాయి .
    షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్
    01)HTML & CSS Training Videos in Telugu
    02)JavaScript Training Videos in Telugu
    03)jQuery Training Videos in Telugu
    04)WordPress Training Videos Telugu
    05)Blogger Training videos Telugu
    06)Php training videos Telugu
    07)PhotoShop training videos Telugu
    08)C Language
    http://goo.gl/Dro6SL
    09)C++ Language Telugu
    http://goo.gl/aMQHbJ
    10)ASP.Net Videos Telugu
    http://goo.gl/BxNBnT
    11)CorelDraw Telugu
    http://goo.gl/UxcT4R
    12)MS Word videos Telugu
    http://goo.gl/wuRmbD
    13)MS Excel Videos Telugu
    http://goo.gl/nnzryt
    14)Java Videos Telugu
    http://goo.gl/N0rpyV
    15)Computer Fundamentals Telugu
    http://goo.gl/jUp9kt
    16)PageMaker Videos Telugu
    http://goo.gl/AMYWsu
    17)Autocad
    http://goo.gl/c7nfpF
    18)Autocad 3D
    http://goo.gl/qXXeb0
    19)ADO.Net
    http://goo.gl/Czti2E
    20)Adobe Flash
    http://goo.gl/sxUfGK
    ******
    For More Videos Subcribe
    www.goo.gl/z98wKo

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని

నిన్నటి 'ఈనాడు'లో తీవ్ర తప్పిదం - నిర్లక్ష్యమా, ఉద్దేశపూర్వకమా?

శుక్రవారం(18.4.14) ఉదయానికి  తెలుగువారికి సంబంధించిన రెండు రాష్ట్రాలలోనూ అతిముఖ్యమైన వార్త అది.  అన్ని దినపత్రికలూ  సహజంగానే ఆ వార్తను  ప్రాధాన్యతాక్రమంలో అత్యంత ముఖ్యమైన స్థానమైన పైవరుసలో(పత్రికా పరిభాషలో దీనిని బ్యానర్ వార్త అంటారు) ఇచ్చాయి. కానీ   తెలుగులో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ దినపత్రిక అయిన 'ఈనాడు'లోమాత్రం భూతద్దం పెట్టి వెతికినా అది కనబడదు. ఆ వివరాలేమిటో చూడండి. తెలుగుదేశానికి, భారతీయజనతాపార్టీకి మధ్య  సీమాంధ్రలో పొత్తుకు సంబంధించి   గురువారంనాడు విభేదాలు పొడసూపటం, ప్రతిష్టంభన నెలకొనటం తెలిసిందే(శుక్రవారం సాయంత్రానికి విభేదాలు సమసిపోయాయి...అది వేరే విషయం). స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే గురువారంసాయంత్రం విజయనగరంలో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, పొత్తువల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువగా కలిగేటట్లుందని చెప్పారు. దీంతో న్యూస్ ఛానల్స్ అన్నింటిలో గురువారం మధ్యాహ్నందగ్గరనుంచీ ఇదే పెద్ద వార్తయి కూర్చుంది. గంటగంటకూ అప్ డేట్స్, ఫోన్ ఇన్స్, చర్చా కార్యక్రమాలు సాగాయి. ఇక శుక్రవారం ఉదయం వచ్చే దినపత్రికలన్నింటిలో ఇదే మొదటి, అతిముఖ్యవార్త అయింది(రెండురాష్ట్ర

30వ రాష్ట్రంగా రాయలసీమ! రాజుకుంటున్న 'ప్రత్యేక' ఉద్యమం

అసమానతలనుంచి అసంతృప్తి పుట్టుకొస్తుంది. అసంతృప్తినుంచి ఆక్రోశం పెల్లుబుకుతుంది. రాయలసీమ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అసంతృప్తితో సీమవాసులు రగిలిపోతున్నారు. ఏళ్ళ తరబడి వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. Read Full Story Here.