ఏదో ఒక సమస్య తీసుకుని ప్రజా ఉద్యమాలు నడిపి అర్జెంట్‌గా ఏపీలో అగ్రనేతగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకున్న నటుడు శివాజికి దురదృష్టవశాత్తూ నిన్న విశాఖపట్నంలో చుక్కెదురయింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాకోసం శివాజీ ఇటీవల ఉద్యమం ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్రం నలువైపులా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. తిరుపతిలో మొదటి సమావేశం నిర్వహించారుకూడా. గురువారం విశాఖపట్నంలో ఆంధ్రా యూనివర్సిటీలోని ప్లాటినంజుబ్లీ హాల్‌లో ఈ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. సమావేశంలో మాట్లాడుతూ కొందరు వక్తలు బీజేపీ, టీడీపీ పార్టీలను విమర్శించినపుడు శివాజీ వారిని అడ్డుకుని మైక్ కట్ చేశారు. దీంతో అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ వక్తలను శివాజి అనుచరులు అడ్డుకోవటానికి ప్రయత్నించటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అసంతృప్తికి గురైన శివాజి, ఇలా అయితే వెళ్ళిపోతానంటూ తన అనుచరులతోసహా అక్కడనుంచి కారులో ఉడాయించారు. ఓర్పు, సహనంలేని శివాజికి రాజకీయాలు ఎందుకంటూ సమావేశానికి హాజరైన విద్యార్థులు, ఉద్యమకారులు హీరోగారిని తీవ్రంగా దుర్భాషలాడారు. ఈ సమావేశంతాలూకు వీడియోను ఇక్కడ చూడొచ్చు. 'మాస...
ఆనోభద్రా క్రతవోయంతు విశ్వత: Let noble thoughts come from all sides