ఎనిమిది నెలలక్రితం తిరుగులేని మెజారిటీతో అధికారం చేజిక్కించుకున్న 'మోడి-షా అండ్ కో'కు ఢిల్లీ ఆమ్ ఆద్మీలు(సామాన్య మానవులు) దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చారు. ప్రభుత్వంలో, పార్టీలో ఏకపక్షంగా - కేంద్రీకృతంగా వ్యవహారాలు నడుపుతున్న మోడి-షా ద్వయానికి ఇది చెంపపెట్టు. అమిత్ షా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఈ ఎన్నికలలో తన శక్తియుక్తులన్నింటినీ ప్రయోగించినా ఉపయోగం లేకుండా పోయింది. తమపార్టీ ఎంపీలు 300మందినికూడా అమిత్ షా ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో దించారు. ఢిల్లీ నగరంలో గణనీయసంఖ్యలో ఉన్న ఆంధ్రప్రాంత తెలుగువారిని ఆకట్టుకోవటంకోసం ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ ప్యాకేజ్ ప్రకటించారు. ఆఖరు నిమిషంలో కిరణ్‌బేడిని పార్టీలోకి తీసుకుని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు(దీంతో అంతర్గత విభేదాలు మొదలై ఇదే చివరికి 'బూమరాంగ్' అయింది). స్వయంగా నరేంద్ర మోడి విస్తృతంగా ప్రచారసభలలో పాల్గొని ప్రజలకు అనేక వాగ్దానాలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో చేసిన తప్పులను తెలుసుకుని దాదాపు సంవత్సరకాలంగా పక్కా ప్రణాళికతో పనిచేస్తూ లక్ష్యాన్ని సాధించింది. పా...
ఆనోభద్రా క్రతవోయంతు విశ్వత: Let noble thoughts come from all sides