బ్లాగ్ ప్రపంచంలో ఇప్పటికే ఈ కాపీకొట్టడాలు, చెత్తకామెంట్లకు జడిసి చాలామంది మంచి మంచి బ్లాగర్‌లు పోస్ట్‌లు రాయటం ఆపేశారు. ఇటీవల 'కష్టేఫలి' బ్లాగ్ శర్మగారుకూడా అస్త్రసన్యాసం చేయాలనుకున్నప్పటికీ మిగిలిన బ్లాగర్‌ల అభ్యర్ధనలను మన్నించి విరమించుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్లాగు రచయితకుకూడా కష్టేఫలి శర్మగారిలాంటి అనుభవం ఎదురైంది. ఈనెల 12న ప్రముఖ తెలుగు చిత్రనిర్మాత కె.మురారి చెన్నైలో ప్రెస్‌మీట్ నిర్వహించి దర్శకుడు రాఘవేంద్రరావుకు గీతం యూనివర్సిటీవారు డాక్టరేట్ ఇవ్వటంపై స్పందించారు. రాఘవేంద్రరావువంటి సంస్కారహీనుడికి గౌరవ డాక్టరేట్ ఇవ్వటమేమిటంటూ ధ్వజమెత్తారు. ఈ ప్రెస్‌మీట్‌కు తెలుగు రిపోర్టర్‌లందరూ వెళ్ళినప్పటికీ రాఘవేంద్రరావుఅంటే భయమో, భక్తోగానీ 10టీవీతప్పితే మిగిలిన ఏ తెలుగు దినపత్రికగానీ, ఛానల్‌గానీ ఆ వార్తను ఇవ్వలేదు. 10టీవీవారుమాత్రం సమాచారం అందిన వెంటనే తమ చెన్నై రిపోర్టర్ ఫోన్ ఇన్ తీసుకుని దానిని ప్రసారం చేశారు. యథాలాపంగా టీవీఛానళ్ళన్నిటినీ చూస్తూ 10టీవీలో ఆ వార్తను చూసిన ఈ బ్లాగర్ అదేరోజు మూడుగంటల ప్రాంతంలో దానిపై 'దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు తృటిలో తప్పిన చ...
ఆనోభద్రా క్రతవోయంతు విశ్వత: Let noble thoughts come from all sides