Skip to main content

తెలుగువారి ఇంటింటా అలుముకున్న విచారం

తెలుగు సినీరంగమూలస్తంభాలలో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు మరణించారన్నవార్తతో ఈ ఉదయంనుంచి రాష్ట్రంలోని ప్రతిఇంటా ఒకరకమైన విషాదం అలుముకుంది. ప్రతివారూ తమ ఇంట్లోని వ్యక్తి ఎవరో చనిపోయినట్లు విచారిస్తున్నారంటే దానికి కారణం ఆరు దశాబ్దాలుగా అక్కినేని ఆయా తరాలపైవేసిన ముద్రే అని చెప్పాలి. ముఖ్యంగా ప్రస్తుతం 40 సంవత్సరాలు, ఆ పైన వయస్సులో ఉన్న తెలుగువారందరూ అక్కినేని చిత్రాలు చూస్తూ పెరిగినవారే కావటంతో వారందరి జీవితం, సంస్కృతిలో ఆయన ఒక భాగమైపోయారు. ఈ కారణాలన్నిటిరీత్యా అక్కినేని మరణవార్త వారిని విచారానికి గురిచేసింది. అందుకే ఆయన భౌతిక కాయం చూడటానికి అన్నపూర్ణ స్టూడియోకు సినీపరిశ్రమవారు, వీఐపీలు, బంధువులకంటే సామాన్యజనమే ఎక్కువమంది తరలివస్తున్నారు. ఉదయంనుంచీ దాదాపుగా ఇళ్ళలో ఉన్నవారందరూ వివిధ టీవీ ఛానళ్ళలోఅక్కినేని మృతిపైవస్తున్న లైవ్ కార్యక్రమాలను కళ్ళప్పగించి చూస్తున్నారు. ముఖ్యంగా నాగార్జున మధ్యమధ్యలో కంటినీరు పెట్టుకుంటుడటం, సంబాళించుకుని వచ్చేవారిని పలకరించటం, అక్కినేని కుటుంబసభ్యులందరూ ఎటూ వెళ్ళకుండా భౌతికకాయంవద్దే నిలబడిఉండటం టీవీలు చూస్తున్నవారందరినీ కదిలిస్తున్నాయి. అక్కినేనికి నివాళులు అర్పించటానికి సినీ, రాజకీయ ప్రముఖులు పెద్దఎత్తున తరలి వస్తుండటంతో టీవీలు చూస్తున్నవారికి విచారంలో కాస్త ఊరట లభించినట్లయింది.


మరోవైపు ఏవీఎస్‌తో మొదలుపెట్టి, శ్రీహరి, ధర్మవరపు, ఉదయకిరణ్, వడ్డే రమేష్, అంజలీదేవి, ఈవీవీగిరి...ఇప్పుడు అక్కినేని - ఇలా వరసగా చనిపోతుండటంతో తెలుగు సినీపరిశ్రమవారు హడలిపోతున్నారు. ముఖ్యంగా పరిశ్రమకు చెందిన వయోవృద్ధులు తర్వాత తమవంతేమోనన్న భయంతో కన్నీరుమున్నీరవుతున్నారు

Image courtesy:wikipedia

Comments

Popular posts from this blog

ఎన్టీఆర్ కంటే ఎస్వీఆరే గొప్ప నటుడన్న కైకాల

నటుడిగా ఎన్టీరామారావుకన్నా కూడా ఎస్వీరంగారావే గొప్ప ఆర్టిస్ట్ అని ప్రముఖనటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. గత ఆదివారం ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఎస్వీఆర్ గురించి ప్రస్తావన వచ్చినపుడు కైకాల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్వీరంగారావులో ఉన్న వైవిధ్యం అపూర్వం, అద్భుతమని చెప్పారు. రారాజు దుర్యోధనుడుగాగానీ - సామాన్య గృహస్థుగాగానీ, జమీందారుగాగానీ, గుడ్డి బిచ్చవాడిగాగానీ, మోతుబరిగాగానీ-పేదరైతుగాగానీ ఏ పాత్రలోనయినా ఆయన ఇట్టే ఒదిగిపోతారని కైకాల చెప్పారు. ఎస్వీఆర్ భారతదేశం గర్వించదగ్గనటుడని, ఆయన తెలుగువాడిగా పుట్టడం తెలుగువారి అదృష్టమని అన్నారు. ఖచ్చితంగా ఎన్టీరామారావుకన్నా ఎస్వీరంగారావే ఉత్తమనటుడయినప్పటికీ, రామారావుదొక అపూర్వమైన రూపమని చెప్పారు. ఆయన రూపం బాగా కెమేరాఫ్రెండ్లీ అని తెలిపారు. రంగారావుతో సీన్ చేసేటప్పుడు రామారావు, నాగేశ్వరరావు కూడా, ఆయన తమను డేమినేట్ చేస్తాడేమోనని బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళని('పాండవ వనవాసం'లో "బానిసలు!... బానిసలకు ఇంత అహంభావమా?" డైలాగ్ చాలామందికి గుర్తుండి ఉండవచ్చు!) కైకాల అన్నారు. అయితే ఎస్వీఆర్, సెట్ కు తాగివచ్చి కొన్ని...

ఏపీ ఎన్నికలు: బలంగా ప్రభావం చూపనున్న నెగెటివ్ ఓటు!

  ఐదేళ్ళు ఒక పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత ఉండటం సహజం(ఇటీవలికాలంలో ఒడిషా, అప్పట్లో ప.బెంగాల్ వంటి కొన్ని అరుదైన సందర్భాలు తప్ప). అయితే వైసీపీ పాలనలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఏపీలో ధారాళంగా అందుతున్న సంక్షేమ పథకాల పుణ్యమా అని వైసీపీకి సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, మరోవైపు వ్యతిరేకులు కూడా పెద్ద సంఖ్యలోనే తయారయ్యారు. పోలింగ్ రోజున - జగన్ సానుభూతి పరుల సంకల్పం గట్టిగా ఉంటుందా, ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ గెలవకూడదు అనే వర్గాల సంకల్పం గట్టిగా ఉంటుందా అనేదానిని బట్టి ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుంది... పూర్తి వ్యాసం చదవటానికి ఇది నొక్కండి -   లింక్ .  

30వ రాష్ట్రంగా రాయలసీమ! రాజుకుంటున్న 'ప్రత్యేక' ఉద్యమం

అసమానతలనుంచి అసంతృప్తి పుట్టుకొస్తుంది. అసంతృప్తినుంచి ఆక్రోశం పెల్లుబుకుతుంది. రాయలసీమ ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. అసంతృప్తితో సీమవాసులు రగిలిపోతున్నారు. ఏళ్ళ తరబడి వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నామంటూ రాయలసీమ వాసులు మండిపడుతున్నారు. Read Full Story Here.