మీరు లేదా మీవాళ్ళు హైదరాబాద్ నగరంలో ఉంటున్నట్లయితే , మీ ఇంటి శాటిలైట్ మ్యాపును , 360 డిగ్రీలలో ఫోటోలను చూసుకునే అవకాశాన్ని ఒక భారతీయసంస్థ కల్పిస్తోంది . వోనోబో . కామ్ (www.wonobo.com) అనే వెబ్ సైట్ ద్వారా మీరు మీ ఇంటి శాటిలైట్ మ్యాప్ , ఫోటోలు చూసుకోవచ్చు . ఆ వెబ్ సైటుకు వెళ్ళగానే , మీరు ఏ నగరం చూడాలనుకుంటున్నారని ప్రశ్న ఎదురవుతుంది . అక్కడున్న డ్రాప్ డౌన్ లోనుంచి హైదరాబాద్ నగరాన్ని ఎంచుకోవాలి . మీరు ఆ నగరాన్ని ఎంచుకుని ఎంటర్ నొక్కగానే చార్మినార్ ఫోటో కనిపిస్తుంది . అయితే మీరు చూడాలనుకున్న ప్రదేశంకోసం మీరు కుడివైపు కిందభాగంలో కనిపిస్తున్న మ్యాప్ పైన క్లిక్ చేయాలి . అప్పుడు స్క్రీన్ సగభాగంలో మ్యాప్ , సగభాగంలో ఫోటో కనిపిస్తాయి . ఆ మ్యాప్ ద్వారా మౌస్ ను కదిలిస్తూ మీరు వెళ్ళాలనుకున్న చోటికి వెళ్ళొచ్చు . అక్కడ మీరు చూడాలనుకున్న ప్రదేశం మ్యాప్ తోబాటు , 360 డిగ్రీలలో ఫోటోలు కూడా దర్శనమిస్తాయి . మీరు టెక్నాలజీ పెద్దగా పరిచయంలేనివారైతే , ఈ వెబ్ సైట్ మీకు పల్లెటూరుతప్ప మరేమీ తెలియనివారిని నగరం నడిబొడ్డున వదిలినట్లుగా , కొద్దిగా అయోమయంగానే ఉంటుంది . ఎవరినైనా సాయం తీసుకుంటే నేవిగేషన...
ఆనోభద్రా క్రతవోయంతు విశ్వత: Let noble thoughts come from all sides