యాపిల్ తెలుగు కీబోర్డ్ అలవాటు ఉన్నవారికి కొత్తగా కంప్యూటర్‌లో ఆ సెటప్ పెట్టుకోవడానికి సాధారణంగా రెండు మార్గాలను అనుసరిస్తున్నాం. 1) అనూ ఫాంట్స్ సాఫ్ట్ వేర్ ఇన్‌స్టాల్ చేసుకోవడం.(ఇది యూనికోడ్ కాదు) 2) వీవెన్ గారు రూపొందించిన కీబోర్డ్ లేఔట్‌ను నెట్‌నుంచి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేయడం. అనూ ఫాంట్స్ ఇన్‌స్టాల్ చేయాలంటే దానిని కొననైనా కొనాలి...లేదా పైరసీ వెర్షన్ అయినా తీసుకోవాలి. అందుకనే యాపిల్ కీబోర్డ్ వాడేవారం ఎక్కువగా వీవెన్ గారి సాఫ్ట్ వేర్ వాడుతున్నాం. అయితే దీనిలో కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నాయి. ‘ఇన్‌స్టాల్‘ అనే పదం కంపోజ్ చేయాలంటే ఇన్ స్టాల్ అని మధ్యలో గ్యాప్ ఇచ్చి కంపోజ్ చేయవలసి వస్తోంది. అలాగే ‘జ్ఞానము’ అనే పదములో ఉన్న మొదటి అక్షరం కంపోజ్ చేయడానికి వీలుకావడంలేదు. ఇదేకాక మనం మన ఇంట్లో కాకుండా బయట ఎక్కడైనా(నెట్ సెంటర్‌లోగానీ, వేరే సిస్టమ్‌లోగానీ) తెలుగులో కంపోజ్ చేయాలంటే తెలుగు సాఫ్ట్ వేర్ అక్కడ అందుబాటులో ఉండటం అరుదు. పై సమస్యలన్నింటికీ ఒక పరిష్కారం ఉంది. దీనిగురించి మీకు తెలిస్తే సరే. తెలియకపోతే కింద చూడండి. తెలుగు కీబోర్డుల గురించి నెట్‌లో బ్రౌజ్ చేస్తుండగా నా...
ఆనోభద్రా క్రతవోయంతు విశ్వత: Let noble thoughts come from all sides