‘ పీసీసీ నాయకత్వం కాపుకు ’ , ‘ మంత్రివర్గవిస్తరణలో ఇద్దరు కాపులు ’ , ‘ కొత్త సమాచార కమిషనర్లలో ఇద్దరు కాపులు ’ . అసలు కాపులకు ఇప్పుడు ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు ? వీళ్ళను ఈ స్థాయిలో ఎందుకు అందలాలెక్కిస్తున్నారు ? ఇప్పుడు రాష్ట్రంలో మీడియాలో ఇదో పెద్ద చర్చ అయి కూర్చుంది. మరోవైపు, ఉన్నట్లుండి కాపులకు లభిస్తున్న ఈ గుర్తింపుపై మిగిలిన కులాల్లో(ముఖ్యంగా వెనకబడిన వర్గాలలో) కొంత వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. అయితే కాపువర్గాలు మాత్రం, కాంగ్రెస్ అధిష్టానం ఆడుతున్న కుల రాజకీయ చదరంగంలో తమ వర్గం పావులాగా మారడం వలన తాము ఇలా అందరి వ్యతిరేకతను మూటకట్టుకోవలసి వస్తోందని వాపోతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా, ముఖ్యంగా యూపీ, బీహార్ వంటి రాష్ట్రాలలో రాజ్యమేలుతున్న కులరాజకీయాల ఫార్ములాను ఆంధ్రప్రదే శ్‍లో కూడా అమలుచేసే ప్రణాళికలో భాగమే కాంగ్రెస్ అధిష్టానానికి కాపులపై ఈ కొత్త ప్రేమ అనేది అందరికీ తెలిసిన విషయమే. తెలుగుదేశంపార్టీ పెట్టినపుడు కమ్మయువత, ప్రజారాజ్యం పెట్టినపుడు కాపుయువత ఆవేశంతో ఎలా ఊగిపోయారో, ఇప్పుడు వై ఎస్‍ఆర్ కాంగ్రెస్ పార్టీపట్ల రెడ్డి యువత కూడా అంతే ఆవేశంగా ఉన్నారన్న విషయం ఢిల్...
ఆనోభద్రా క్రతవోయంతు విశ్వత: Let noble thoughts come from all sides